
చెడు కొవ్వు లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
ఎక్కువ వ్యాయామం చేసిన తర్వాత చెమటలు పట్టడం సహజం. కానీ సాధారణ పరిస్థితుల్లో లేదా శీతాకాలంలో కూడా విపరీతంగా చెమటలు పట్టడం ప్రారంభమైతే.. అది అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల లక్షణాలు అని గ్రహించాలి.ఇంకా ఛాతీ నొప్పి అనేది అధిక కొలెస్ట్రాల్ ముఖ్యమైన లక్షణం.అందుకే మీకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ నొప్పి కొన్ని రోజులు ఉంటుంది. ఛాతీ నొప్పి కూడా గుండె జబ్బుల ముఖ్య లక్షణం. అందుకే ఇది చాలా ప్రమాదకరమైనది.చెడు కొవ్వు అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌కు దారి తీస్తుంది. కొవ్వు కాలేయంలో ఉత్పత్తి అయ్యే జిగట పదార్థం. ఇది ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడంలో బాగా సహాయపడుతుంది. అయితే, ఎక్కువ నూనె పదార్థాలు, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే.. శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అందువల్ల అది ప్రమాదానికి దారితీస్తుంది.కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి.