మెదడు ఆరోగ్యం కోసం ఈ నాన్ వెజ్ తినండి?

Purushottham Vinay
ఈ రోజుల్లో ఒత్తిడి సమస్య అందరిని ఎంతగానో వేధిస్తుంది.మెదడు ఆరోగ్యానికి ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా చాలా చురుకుగా ఉంటుంది.మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో చేపలు ముఖ్యపాత్రపోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యం కోసం చేపలను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకోవడంలో వేగం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళనలు, మూడ్‌ స్వింగ్స్‌తో బాధపడే గర్భిణులు సీఫుడ్ ఎక్కువగా తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, డి విటమిన్ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి మంచి మూడ్‌ని కలిగిస్తాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు పుట్టబోయే బిడ్డ మెదడు అభివృద్ధికీ దోహదం చేస్తాయి. హెర్రింగ్ మరియు మాకేరెల్ వంటి కొన్ని కొవ్వు చేపలను తినే వారు చేపలను తినని వారి కంటే అధిక మేధస్సు స్థాయిని కలిగిఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.


చేపలను తినడం ద్వారా మెదడు  లెర్నింగ్ , మెమరీ సెంటర్ అయిన మీ హిప్పోకాంపస్ పరిమాణాన్ని కూడా పెంచుకోవచ్చు. మతిమరుపును నిరోధించవచ్చు. మెదడు ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా చేపలను తినడం ద్వారా, వృద్ధులు ముఖ్యంగా జ్ఞాపకశక్తిని కోల్పోకుండా నిరోధించవచ్చు. ఆహారంలో చేపలను క్రమం తప్పకుండా చేర్చుకోవడం ప్రారంభిస్తే మెదడుకు సంబంధించి కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చేపలలో కనిపించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కొన్ని హార్మోన్ల ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ముఖ్యంగా రక్తం గడ్డకట్టడం, ధమని గోడ సంకోచం , సడలింపు, వాపు వంటి సమస్యలకు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తోడ్పడతాయి. అవి మెదడులోని ధమనులకు మద్దతు ఇస్తాయి. న్యూరోఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. మెదడును రక్షించడంలో సహాయపడతాయి. వారానికి ఒకసారి చేపలు తినడం వల్ల మీ హిప్పోకాంపస్ పద్నాలుగు శాతం పెరుగుతుంది. ఇది మీ అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం ఇంకా అలాగే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: