
బెండకాయ వల్ల ఉపయోగాలు తెలిస్తే తినక మానరు..!!
వాస్తవానికి బెండకాయల క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ కంటేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బెండకాయలలో ఉండే ఫైబర్ కరిగి శరీరంలో చెడు పదార్థాలను సైతం తొలగించడానికి చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులను నివారించడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. బెండకాయ జీర్ణ వ్యవస్థలు చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి పలు రకాలుగా సహాయపడుతుంది.
చిన్నపిల్లలు ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే బెండకాయతో ఆహారాన్ని తినిపించడం మంచిది. బెండకాయలు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని చాలా బలంగా ఉంచేలా చేస్తుంది. దీని ద్వారా వివిధ వ్యాధులు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బెండకాయ లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు వల్ల ఫ్రీ రాడికల్ వల్ల కలిగే నష్టం నుండి చాలా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా వాటిని నివారిస్తుంది. బెండకాయ శరీరంపై సీదళీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుచేతనే అటువంటి పరిస్థితిలో ఇవి వేసవికాలంలో బాగా తినడం మంచిది. బెండకాయ ఫ్రై చేసుకుని తినేటప్పుడు మసాలాలు వేయడం వల్ల మన శరీరం చాలా వేడిని కలిగిస్తుంది.