ఈ లక్షణాలు ఉంటే.. రక్తహీనత సమ్యసే..!!

Divya
మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో అన్ని రకాల క్రియలు సక్రమంగా జరగాలి. ముఖ్యంగా ఇందులో ప్రధానమైనది రక్తం.ఇక మన శరీరంలో అందుకు సరిపడు రక్తము ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా జరగాలి అన్న అందుకు ఆక్సిజన్ అందాలి అన్న రక్తం సరఫరా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. రక్తం సరిపడు ఉండకపోతే వాటిని రక్తహీనత అని పిలుస్తూ ఉంటారు. నాకు చాలామంది శరీరంలో సరిపడు రక్తం ఉందా లేదా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే మన శరీరంలో కనిపించి కొన్ని లక్షణాల ఆధారంగా మనకి రక్తం సరిపడి ఉందో లేదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1) రక్తహీనత ఉన్న వారిలో ఎక్కువగా గోడకు రాసిన సున్నాము మంచు ముక్కలు వంటివి తినాలనిపిస్తూ ఉంటుంది ఇవి లక్షణాలుగా కనిపిస్తే రక్తహీనత ఉందని నిర్ధారించుకోవచ్చు.
2). రక్తహీనత ఉన్న వారిలో చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంది ఇలాంటివారు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా మంచిదట.
3) శరీరంలో తగినంత రక్తం లేకపోతే చిన్న పని చేసిన కూడా చాలా అలసిపోతారు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కూడా ఏర్పడుతుందట.
4). శరీరంలో సరిపడు రక్తం లేకపోతే ముఖ్యంగా పెదాలు, చిగుళ్ళు, కనురెప్పలు లోపల ఎరుపు రంగు తగ్గిపోతుంది.

5). ఇక అంతే కాకుండా కండరాల నొప్పులతో సహా నిత్యం ఏదో ఒక విధంగా ఆందోళన కలిగి ఉండడం కూడా రక్తహీనత సమస్యగా భావించాలి.
6). ఇక తలనొప్పి తరచి వస్తున్న వారిలో కూడా ఈ రక్తహీనత సమస్య ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు.
ఇలాంటి లక్షణాలు అన్ని ఎవరిలోనైనా కనిపించాయి అంటే వెంటనే వారు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. ఇక అంతే కాకుండా తరచూ అప్పుడప్పుడు కొన్ని పనులను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: