ఈ టీతో అందం,ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
ఇక మన వంటింట్లో వాముకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. దీనికి ఘాటైన రుచి ఇంకా వాసన ఉంటుంది. పలు జీర్ణ, శ్వాస సమస్యలకు ఇంకా అలాగే నొప్పులకు వాము ఒక చక్కని ఔషధం.వాము ఎక్కువగా వాడేవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగా మెరుగవడం తో పాటు శరీరంలోనిల్వ ఉన్న కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులోకి వస్తుంది. విటమిన్ ఎ, సి, ఇ, కెలతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్‌ ఇంకా పాస్ఫరస్ తదితర పోషకాలు కూడా వాములో ఉంటాయి.ఇక జీలకర్ర విషయానికి వస్తే సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు మంచి ప్రత్యేక స్ధానం వుంది. జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వ్యాధినిరోధకతను బాగా పెంచుతుంది. దీనిలో వుండే పీచు పదార్ధం మలబద్ధకాన్ని ఈజీగా పోగొడుతుంది. జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ సమస్య కంట్రోల్లో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. జీలకర్రలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో హీమో గ్లోబిన్ పెంచుకోవటానికి రెగ్యులర్ డైట్ లోఈ జీకర్రను చేర్చుకోవచ్చు. జీలకర్ర ఎసిడిటిని ఈజీగా తగ్గిస్తుంది.అయితే వాము ఇంకా జీలకర్ర కలిపి తయారు చేసిన టీ తో అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు.


బరువు తగ్గాలనుకునేవారికి వాము ఇంకా జీలకర్రతో కలిపి చేసిన టీ ఎంతగానే తోడ్పడుతుంది. ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా రక్తప్రసరణ ఇంకా గుండె పనితీరు మెరుగవుతుంది. కంటి చూపు కూడా మెరుగవుతుంది. పళ్లు అలాగే చిగుళ్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. ఈ టీ సేవించటం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు మల, మూత్ర ఇంకా చెమట ద్వారా బయటకొచ్చేస్తాయి. ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. కీళ్లు ఇంకా మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది ఓ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలో అదనపు కొవ్వు కూడా కరిగిపోతుంది. రక్తం మొత్తం బాగా శుభ్రమవుతుంది. శరీరంపై ఉన్న ముడతలు పోయి చాలా యవ్వనంగా కనిపిస్తారు. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా వినికిడి సమస్యలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: