వెయిట్ లిఫ్టింగ్: ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
వెయిట్ లిఫ్టింగ్ అనేది అద్భుతమైన వ్యాయామాల్లో ఒకటి. ఇది కేవలం మగవాళ్లకు మాత్రమే సంబంధించిన వ్యాయామం అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, మహిళలు కూడా వెయిట్ లిఫ్టింగ్ ని చేయవచ్చు.అయితే వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంచెం కష్టతరంగా ఉన్నా.. స్త్రీ, పురుషులిద్దరికీ కూడా ఇది అనేక ఆరోగ్య లాభాలను అందిస్తుంది.ఇక ఈ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల మెటబాలిజం రేటు కూడా బాగా పెరుగుతుంది. మెటబాలిజం రేటు పెరిగితే శరీరంలో క్యాలరీలు కూడా చాలా వేగంగా కరుగుతాయి. అందువల్ల వేగంగా బరువు తగ్గాలని భావించే వారు రెగ్యులర్‌గా ఈ వెయిట్ లిఫ్టింగ్ కనుక చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇంకా అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్ ఎంతగానో మేలు చేస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ వల్ల ఎముకల సాంద్రత కూడా బాగా పెరుగుతుంది. దాంతో విరగడం ఇంకా ఫ్రాక్చర్లు అవ్వడం లాంటివి తగ్గుతాయి. అలాగే కండరాల నిర్మాణం కూడా చాలా బాగుంటుంది.ఇంకా అలాగే డిప్రెషన్‌తో బాధపడేవారికి వెయిట్ లిఫ్టింగ్ ఓ మంచి న్యాచురల్ మెడిసిన్ లా పని చేస్తుంది.


ప్రతి రోజూ కాసేపు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే డిప్రెషన్ నుండి చాలా త్వరగా బయటపడతారు. మెదడు పని తీరు కూడా చాలా చురుగ్గా మారుతుంది.అలాగే వెయిట్ లిఫ్టింగ్ వల్ల చక్కటి నిద్ర కూడా పడుతుంది. ఇంకా నిద్రలేమి సమస్యతో సతమతం అయ్యేవారు వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాన్ని అలవాటు చేసుకుంటే ఇక ఆ సమస్య నుండి బయటపడతారు.ఇక అంతేకాదు, వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు  కూడా అదుపులో ఉంటాయి.ఇంకా అలాగే బెల్లీ ఫ్యాట్ సమస్య నుండి సైతం విముక్తి లభిస్తుంది. ఇక ఇన్ని ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టే ఖచ్చితంగా వెయిట్ లిఫ్టింగ్‌ను డైలీ రొటీన్‌లో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది ఖచ్చితంగా శిక్షకుల సమక్షంలోనే చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: