ఇన్నేళ్ళుగా వేధిస్తున్న ప్రాణాంతక వైరస్ కు విరుగుడు ?

VAMSI
ఎయిడ్స్ అనే మహమ్మారి కి ఔషదం లేక దశాబ్దాల నుండి ఎందరో తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకెందరో అనారోగ్యం కారణంగా కుంగి పోతూ జీవిస్తున్నారు. అయితే ప్రపంచం లో ఎయిడ్స్ కు కారణమయ్యే వైరస్ ను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ఎంతగానో శ్రమిస్తున్నాయి కానీ... ఇప్పటి వరకు పూర్తిగా అడ్డుకునే ఔషధం ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ఎయిడ్స్ ను సమూలంగా అరికట్టే ఔషధాన్ని కనుగొని తాజాగా ఈ శుభవార్త ను తెలియచేసారు ఇజ్రాయెల్‌కు చెందిన టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అవును ఇది నిజమే...తరాల తరబడి మానవాళిని పీడిస్తున్న ఈ హెచ్‌ఐవీ కి ఇక చెక్ పెట్టేయొచ్చు.  
జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్‌ రూపంలో ఒక్క డోసు ఇస్తే చాలు... హెచ్‌ఐవీని సమర్థంగా అరికడుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఎయిడ్స్‌ బాధితులకు ఈ ఔషధం సంజీవని లా పనిచేస్తుంది అని.. దీని వలన పూర్తి స్థాయిలో ఈ వైరస్ ను అడ్డుకునే అవకాశముందని వారు అంటున్నారు. ఈ ఔషధం కి సంబందించిన పరిశోధనల్లో భారీ ముందడుగు వేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు .
ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో శరీరం లోకి పంపించడం ద్వారా ఎముక మజ్జలో బి-టైప్‌గా పిలిచే తెల్ల రక్త కణాలు ఉత్పన్నం అవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత ఇవి ఎముక మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థ ల్లోకి ప్రవేశించి అక్కడ నుండి శరీరం లోని వివిధ అవయవాలకు చేరుతాయి. శరీరం లో బ్యాక్టీరియా, వైరస్‌లకు అనుగుణంగా తమని తాము మార్చుకుంటూ రోగ నిరోధక అభివృద్ధి చేసి వైరస్ ను సమూలంగా నిర్మూలిస్తాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిజంగా పెద్ద శుభవార్తే. ఇంకొద్ది రోజుల్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: