మీ వయసు 40 కి దగ్గరపడుతోందా ? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి ?

VAMSI
మాములుగా ఒక మనిషి తన చిన్నతనంలో ఉన్నంత చురుగ్గా, ఫాస్ట్ గా యవ్వనంలో ఉండడం కుదిరే పని కాదు. అదే విధంగా యవ్వనంలో ఉన్నంత  బలంగా వృద్ధాప్యం లో ఉండలేము. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా మన శక్తి తగ్గిపోయి బలహీనంగా మారుతూ ఉంటాము. ముఖ్యంగా మన ఆరోగ్య పరంగా కూడా సమస్యలు తలెత్తుతుంటాయి. ఒకప్పుడు అయితే వయసు 60, 70 ఏళ్లు దాటుతున్నా అప్పటి వారు ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉండేవారు. కానీ, ఇప్పటి ఫాస్ట్ జనరేషన్ లో 40 దాటితే షుగర్ టెస్ట్, బిపి అంటూ పలు రకాల టెస్ట్ లు చేయించుకోవడం తప్పనిసరి అయిపోతుంది.
ఇందుకు మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. అయితే వీటి నుండి మనల్ని మనం రక్షించుకుంటు మన ఆరోగ్యాన్ని కాపుడుకునేందుకు  చక్కటి అవకాశాలు ఉన్నాయి. మీ వయసు 40 ఏళ్లకు దగ్గరపడుతోంది అంటే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి అంటున్నారు కొందరు వైద్య నిపుణులు.  కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని పద్ధతులు అలవరుచుకోవాలి అలాగే వ్యాయామం, యోగ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ ఆచరించాలి.
మీరు పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్దాలను రోజు వారీ ఆహారంలో అధికంగా తీసుకోవాలి. తినే ఆహారంలో కొలెస్ట్రాల్, చక్కెర శాతం తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.  కూరగాయలు ధాన్యాలు, తాజాపండ్లు, ఆకుకూరలు రెగ్యులర్ గా తినేలా శ్రద్ద తీసుకోవాలి. నూనె వంటకాలను పూర్తిగా దూరం పెట్టండం శ్రేయస్కరం. అలాగే ఫిట్ నెస్ మన హెల్త్ ను చక్కగా కాపాడుతుంది. అందుకే 40 తర్వాత రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి.   మరి మీరు కూడా ఈ వయసుకు దగ్గరగా ఉంటే.. వెంటనే పైవాటిని ఆచరణలో పెట్టండి.   
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: