స్త్రీలు నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే ఈ పండు తినాలి!

Purushottham Vinay
మల్బరీ పండ్లు అనేవి మొదట చైనా దేశంలో మొదలై ప్రపంచ వ్యాప్తంగా కూడా చేరాయి. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విక్రయాలు కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. కాబట్టి ఈ పండ్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ బాగా పెరిగింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో మూడు రంగుల్లో(నలుపు, నీలం, ఎరుపు) దొరుకుతుంది.ఇక మల్బరీ పండు కేవలం రుచినే కాదు శరీరానికి కూడా చాలా మంచి పోషక విలువలను అందజేస్తుంది. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఐరన్ ఇంకా అలాగే కాల్షియం మొదలైనవి ఉంటాయి. ఈ మల్బరీ పండు వల్ల మహిళలకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని ద్వారా స్త్రీలకు కలిగే ప్రయోజనాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక తరచుగా స్త్రీలు ఐరన్ లోపం సమస్యలతో బాగా బాధపడుతూ ఉంటారు. ఈ ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్యలు బాగా ఏర్పాడతాయి. ఈ సమస్యలు అనేవి వారికి ఎక్కువగా గర్భధారణ సమయంలో మొదలవుతుంది. ఇక ఈ పరిస్థితులలో మల్బరీ పండ్లను తీసుకోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.


ఇందులో ఐరన్ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యని తగ్గిస్తుంది.అలాగే 30 సంవత్సరాల వయస్సు తర్వాత మహిళల్లో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మల్బరీ పండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచి ఇంకా అలాగే కీళ్ల నొప్పులను తొలగించడానికి సహాయపడుతుంది.ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ల చాలా ఎక్కువగా ఉన్నందున ఎముకలు, కండరాలపై ప్రభావం చూపుతుంది.అలాగే మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది మహిళలు బరువు పెరుగుతున్నారు. బరువుని తగ్గించుకోవడానికి వ్యాయామం ఇంకా డైటింగ్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇవి శరీర బరువుపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. మల్బరీ పండులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల బరువును సులభంగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: