ఓవర్ థింకింగ్ కు ఇలా చెక్ పెట్టవచ్చునట..

Satvika
ఛాలా మందికి ఒక విచిత్రమైన జబ్బు ఉంటుంది. ఏదైనా చిన్న సమస్య వచ్చినా, చిన్న సంతోషం వేసినా కూడా చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతారు.ఆ సమయంలో వాళ్ళు ఎం చేస్తున్నారో అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు. అలా చేయడం వల్ల అనారొగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఆరోగ్యం పై శ్రద్ద తీసుకోవడం తో పాటుగా ఇలాంటి వాటి గురించి కూడా ఫోకస్ పెట్టాలని అంటున్నారు. అసలు అలా చేయడం వల్ల ఏదైనా అవుతుందా..అలాంటివి తగ్గించు కొవాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..


కొందరు పిచ్చోళ్లుగా మారితే.. మరికొందరు సైకోలుగా మారిపోయారు. తమ బంగారం లాంటి భవిష్యత్‌ను ఈ ఓవర్ థింకింగ్ కారణంగా సర్వనాశనం చేసుకున్నారు.. చేసుకుంటున్నారు. అయితే, ఈ ఓవర్ థింకింగ్ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు ప్రముఖ యోగా ట్రైనర్ ఎకార్ట్ టోల్లే. అవును.. మీ బ్రెయిన్‌ను, మీ థింకింగ్స్‌ను మీరే కంట్రోల్ చేసుకోవడానికి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారాయన. కొన్ని సెకన్ల వ్యవధిలోనే మీ ఆలోచనలను పాజ్ చేసి, మీ మనస్సును నిర్మలంగా చేసే ఒక మార్గాన్ని చూపించారు.


టిక్‌టాక్ పేజీ ది మెంటల్ లెవెల్ 'జెడి మైండ్ ట్రిక్' పేరుతో వీడియో షేర్ చేశారాయ. ఆ ట్రిక్ ద్వారా ప్రజలు చాలా త్వరగా తమ మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోగలరని చెబుతున్నారు. మరి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జెడి మైండ్ ట్రిక్ ప్రకారం.. ''మీ మనస్సును పూర్తి స్తబ్ధుగా ఉంచండి. అంటే.. కళ్లు మూసుకుని, మొత్తం గట్టిగా గాలి పీల్చుకుని, మనసంగా నిర్మానుష్యంగా ఉండా ఉండేలా చేసుకుని కాసేపు పాజ్ చేసి ఉంచాలి. కేవలం చీకటిని మాత్రమే దర్శించాలి. ఆ తరువాత శ్వాసనువ వదిలి.. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి.. ఇప్పుడు నేనేం చేయాలి..ఇలా శ్వాస పై ఫోకస్ పెడుతూ చెయ్యడం వల్ల ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది అని అంటున్నారు.ఈ ట్రిక్ అద్భుతంగా పని చేస్తుందని తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు...మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే మీరు కూడా ఇలా చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: