చిన్న పిల్లలకు పొరపాటున ఈ ఆహారాలను తినిపిస్తే ఎంత ప్రమాదమో..!!

Divya
సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల మానసిక అభివృద్ధికి అవసరమైన పనులను చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు శిశువుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారికి ఆహారం, స్నానం, నిద్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉండాలి.. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. వీటివల్ల శిశువులకు చాలా హాని కలుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు. కొంతమంది తల్లులు పసిపిల్లలకు కొన్ని ఆహారాలను వినిపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి వారి ఆరోగ్యానికి మంచివి కావు.. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాగా కాల్చిన మాంసాన్ని చిన్నపిల్లలకి అసలు పెట్టకూడదు. చిన్న పిల్లలే కాదు వృద్ధులు కూడా వీటిని తినకపోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు శిష్యులకు ఇలాంటి మాంసాన్ని తినిపించడం వల్ల వారి ఆరోగ్యానికి మంచిది.. ఉడికించినది తినిపిస్తే మంచిది.

ఇక పిల్లలకు రొయ్యలు, ఎండ్రకాయలు సముద్రపు ఆహారాన్ని అసలు తినిపించకూడదు. వాస్తవానికి చేపల ఆహారంలో ప్రొటీన్లు ఒమేగా-3, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న రోజులలో వీటిలో ఎక్కువగా పాదరసం ఉన్నట్లుగా తెలియ బడింది.



తీపి పదార్థాలు.. చక్కెర తో తయారు చేసినటువంటి ఆహారాన్ని పిల్లలకు ఎక్కువగా తినిపించకూడదట. ప్రస్తుతం ఉన్న కాలంలో పసిపిల్లలకు తమ తల్లిదండ్రులు ఎక్కువగా చాక్లెట్లు తినిపిస్తూ ఉంటారు. ఈ చాక్లెట్లు పిల్లలకు రుచి గా ఉండడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.వీటిలో అనేక రసాయనాలు ఉంటాయి దీనివల్ల అనారోగ్యం కూడా కలుగుతుందట. ఇక అంతే కాకుండా పిల్లల శరీర అభివృద్ధిపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉన్నది.

వేరుశెనగ కు సంబంధించి ఎటువంటి వాటిని కూడా ఎక్కువగా తినిపించకూడదు. ఇందులో ఓలేయిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల కొలెస్ట్రాల్ కూడా అధికంగా పెరుగుతుందని వైద్యులు తెలియజేయడం జరిగింది. దీనివల్ల ఎన్నో అలర్జీలు కూడా వస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: