షుగర్ : తగ్గాలంటే ఇవి తినాల్సిందే!

Purushottham Vinay
వ్యాయామం చేయడం, సరైన నిద్ర ఇంకా అలాగే ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి చేయడం వల్ల మధుమేహాన్ని ఈజీగా కంట్రోల్‌ చేయవచ్చు. మధుమేహం ఉన్న వ్యక్తి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలలో ఆహారం కూడా ఒకటి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఆహారం అనేది ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు ఆహారాలని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. అప్పుడే చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి.ఇక అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.ఫైబర్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ డెలివరీ నెమ్మదిస్తుంది. పీచు పదార్థాలలో ఫైబర్‌ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ప్రతిరోజు వేర్వేరు సమయాల్లో ఆపిల్ ఇంకా నారింజ అలాగే బొప్పాయి వంటి పీచు పండ్లను తినడానికి ప్రయత్నించండి.శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రొటీన్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పాలి. మధుమేహం ఉన్నవారు తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లను తీసుకుంటే చాలా మంచిది.




కాబట్టి వారు శక్తిని పొందడానికి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా అవసరమవుతుంది. కాబట్టి ప్రొటీన్ ఉన్న ఆహారాలని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది.ఇంకా అలాగే అనారోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను బాగా పెంచుతాయి. ఫలితంగా అధిక రక్తపోటు ఇంకా అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇలా కాకూడదంటే కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలని మీరు ఎంచుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ నూనెలను ఉపయోగించడం చాలా మంచిది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్ టైరోసోల్ ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.అలాగే మధుమేహ రోగులు పిండి పదార్థాలను పూర్తిగా తగ్గించాల్సిన అవసరం లేదు. ఓట్స్ ఇంకా అలాగే బార్లీ వంటి ఆరోగ్యకరమైన పిండి పదార్థాలకి మారితే మంచిది. బార్లీలో కరిగే ఫైబర్‌లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి గ్లూకోజ్ స్థాయిలను బాగా కంట్రోల్ చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: