వేసవికాలంలో తమలపాకులు తింటే అనారోగ్యాలు పరార్..!!
హిందూ సంప్రదాయంలో తమలపాకులతో చేసే కిళ్లీ లు భోజనం తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతారు. అందుకే ఎక్కడైనా ఫంక్షన్ లు, పెళ్లిళ్లు ఇతరత్రా కార్యక్రమాలు జరిగినప్పుడు కచ్చితంగా భోజనం తర్వాత తమలపాకులతో తయారుచేసిన కిళ్లీ లను ఇస్తూ ఉంటారు.. ఆయుర్వేదం ప్రకారం తమలపాకులు అలాగే తమలపాకులతో తయారుచేసిన కిల్లి తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తమలపాకుల లో అధిక నీటి శాతం ఉండి, తక్కువ కేలరీలు ఉంటాయి. అంతేకాదు కొవ్వులు కూడా తక్కువ స్థాయిలో ఉండి పరిమితమైన ప్రోటీన్లను కూడా కలిగి ఉంటాయి.
ఇక తమలపాకుల లో విటమిన్ ఎ , విటమిన్ బి 1, విటమిన్ బి టు, పొటాషియం, ఐయోడిన్, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల దగ్గు, తలనొప్పి, కడుపు ఉబ్బరం, కీళ్లనొప్పులు, అనోరెక్సియా వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి లేదా వాపు వచ్చినప్పుడు తమలపాకుల వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. శీతాకాలంలో అలాగే వేసవి కాలంలో వచ్చే కఫం వంటి సమస్యలకు మంచి చికిత్స అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు క్యాల్షియం, విటమిన్ సి, నియాసిన్ , థయామిన్, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పాన్ లడ్డుగా అయినా తయారు చేసుకొని తినవచ్చు లేదా కిల్లి గా అయినాసరే తయారు చేసుకొని తినవచ్చు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో తమలపాకులు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.