మట్టి కుండలో నీరు తాగితే ఎంత మేలో తెలుసా?

Purushottham Vinay
ఫ్రిజ్‌లు వచ్చాక..మట్టి కుండలను పక్కన పెట్టేశారు. పూర్వకాలంలో పెద్దలు నీళ్ళను ఈ మట్టి కుండలలోనే స్టోర్ చేసి తాగేవారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం ఎండాకాలం వచ్చిదంటే ఓన్లీ ఫ్రిజ్ వాటర్. అలా కూల్ వాటర్ ని తాగడం వల్ల వెంటనే చాలా హాయిగా అనిపిస్తుంది కానీ.. కొంతకాలం తర్వాత అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలున్నాయి. రిఫ్రిజిరేటర్ లోని చల్లటి నీరు తాగడం వల్ల అకస్మాత్తుగా గొంతు కణాల ఉష్ణోగ్రత కూడా పడిపోతుంది, గొంతు నొప్పితో పాటు జలుబు చేసే ఛాన్స్ ఉంది. మట్టి కుండలో నీళ్ళను తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది కూడా మట్టి కుండలో నీళ్లు పోసుకోని తాగుతుంటారు. ఇక వేసవి కాలం ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని చోట్ల ఈ మట్టి కుండలు బాగా లభిస్తున్నాయి. అలాగే.. ఈమధ్య కాలంలో మట్టి పాత్రలతోపాటు.. మట్టి గ్లాసులు ఇంకా అలాగే మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.



వేసవిలో కుండలోని నీరు తాగాడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు కూడా రావు. జలుబు ఇంకా దగ్గు సమస్యలను తగ్గిస్తుంది.సన్ స్ట్రోక్ అనేది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. వేసవికాలంలో చాలా మంది ఈ వడదెబ్బకు గురవతుంటారు. మట్టికుండలోని నీటిలో విటమిన్లు ఇంకా అలాగే ఖనిజాలు ఎక్కువగా ఉండి.. శరీర గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి ఎంతగానో సహాయపడతాయి.మట్టి కుండలో ఉండే నీరు తాగడం వలన శరీరానికి ఆమ్ల శాతం కూడా అందుతుంది.ఇది కడుపులో యాసిడిటి సమస్యను ఈజీగా తగ్గుతుంది.మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. ఇంకా టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అలాగే జీవక్రియ రేటును బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే అతిగా దాహం వేయదు.శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: