వరుడికి బట్టతల ఉందని.. వధువు ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో బట్టతల అనేది ప్రతి ఒక్కరిలో కూడా సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం ఇక అటు వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోవడంతో సరికొత్త అలవాట్లు రికార్డు జుట్టు రాలిపోవడానికి కారణం అవుతున్నాయ్. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఒత్తిడితో కూడిన జీవితంలో ముందుకు వెళ్తు ఉండడంతో ఇక జుట్టు రాలడం అనే సమస్య ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే జుట్టు రాలుతున్న సమయంలో రాలకుండా ఉండేందుకు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


 భారీగా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కసారి జుట్టు రాలడం మొదలయింది.. అంటే చాలు అది ఆగిపోవడం అసాధ్యమనే చెప్పాలి. ఇటీవలి కాలంలో ఏకంగా పాతిక ఏళ్ళ యువకులు సైతం బట్టతల వచ్చే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా  పెళ్లిచేసుకోవడానికి ఎవరూ కూడా బట్టతల ఉంది అంటూ ముందుకు రాకపోవడంతో యువకులు మరింత నిరాశలో మునిగిపోతున్నారు. ఇక్కడ ఓ యువకుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.


 తనకు బట్టతల ఉంది అన్న విషయాన్ని దాచి పెట్టి పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు ఇక్కడ ఒక యువకుడు. అందరిని బట్టతల లేదు అని అందరిని నమ్మించాడు. పెళ్లి పీటల పై యువతికి అసలు విషయం తెలిసిపోయింది. దీంతో పెళ్లి పీటలు మీదే వివాహం ఆగిపోయింది. ఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్నో వెలుగులోకి వచ్చింది. వరుడు అజయ్ కుమార్ మాటిమాటికి తలపాగాను సర్దుకోవడం చూసి అనుమానం వ్యక్తం చేసింది పెళ్లికూతురు. చివరకు గమనించగా విగ్గు అని తెలుసుకుని.. దీంతో క్షణాల్లోనే స్పృహతప్పి పడిపోయింది. దీంతో అందరూ కంగారు పడ్డారూ. కానీ కాసేపటికే స్పృహలోకి వచ్చిన వధువు బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని పెళ్లి పీటల మీద చెప్పేసింది. దీంతో చేసేదేమీ లేక వరుడు ఫ్యామిలీ అక్కడినుంచి వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: