వామ్మో.. ప్లేట్ బిర్యానీ 20 వేలు.. స్పెషాలిటీ ఏంటంటే?
ఇక ఫ్యామిలీ వెకేషన్స్ లో అయితే బిర్యాని ఉండాల్సిందే. ఇక ఏదైనా దావత్ చేసుకున్న బిర్యానీ లేకుండా ఉండదు. ఇలా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో బిర్యానీ అనేది ఒక భాగంగా మారిపోయింది. అయితే సాధారణంగా బిర్యానీ ఒక ప్లేట్ ధర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న హోటళ్లలో అయితే బిర్యాని 200 రూపాయల వరకు ఉంటుంది. అది పెద్ద హోటళ్లలో అయితే 1000 లోపల ఉంటుంది. కానీ ఏకంగా ఒక ప్లేట్ బిర్యానీ 20000 రూపాయలు ఉండడంగురించి ఎప్పుడైనా విన్నారా. ప్లేట్ బిర్యానీ 20,000 ఏంటండీ.. అంత ఉంటే ఎవరైనా కొంటారా అని అంటారు ఎవరైనా..
కానీ ఇక్కడ హోటల్ లో మాత్రం ప్లేట్ బిర్యానీ అక్షరాల 20000. షాక్ అవుతున్నారు కదా కానీ నిజమే. అయితే ఇది మన దగ్గర కాదు దుబాయ్ లోని బాంబే బార్లో రెస్టారెంట్ లో. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ అమ్ముతారు. దీనికి రాయల్ గోల్డ్ బిర్యానీ అని పేరు పెట్టారు. బంగారు పూత పూసిన ప్లేట్ లో చికెన్ కీమా, వెజ్ బిర్యానీ తో పాటు గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ చికెన్, చికెన్ మీట్ బాల్స్, గ్రిల్డ్ మటన్, మటన్ సీక్ కబాబ్, జీడిపప్పు పై గోల్డ్ కోటెడ్ లేయర్ అందుకే దీనికి ఎంత రేటు. అయితే హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా లో కూడా ఇలాంటి బిర్యాని ఉంటుంది. కానీ ఇంత ధర ఉండదు. ఏదేమైనా ఇక ఈ రాయల్ గోల్డ్ బిర్యానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.