ఆవాలలో వీటిని కలిపి కల్తీ చేస్తున్నారని మీకు తెలుసా..?

Divya
భారతీయ వంట ఇంటిలో మసాలా దినుసులలో తప్పకుండా వాడే వాటిలో ఆవాలు కూడా ఒకటి. ఆవాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా నిండి ఉంటాయి. ముఖ్యంగా ఆవాలను తాలింపు పెట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తాము.. ఉదర సంభందిత సమస్యల నుండి ఉపశమనం పొంది హృదయ ఆరోగ్యాన్ని పెంచడం వరకు ఇలా ప్రతి విషయంలో కూడా మనకు సహాయపడతాయి.. ఇకపోతే ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఆవాలలో విషపూరితమైన విత్తనాలతో కలుషితం కూడా జరుగుతోంది.. అది కూడా అత్యంత ప్రమాదకరమైన అర్జెమోన్ విత్తనాలతో కల్తీ చేస్తున్నారని మీకు తెలుసా..?


ఈ విషపూరితమైన విత్తనాలను ఎలా గుర్తించాలి అనేది ఒక ఆందోళన ప్రశ్నగా మిగిలిపోయింది.. తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వేదిక ద్వారా ఆవాలను ఎలా కల్తీ చేస్తున్నారు.. వాటిని ఎలా గుర్తించడం.. మనకు వివరంగా తెలిపింది.. ఇకపోతే మనం ఇంట్లో ఉపయోగించే ఆహారంలో కల్తీ లను ఎలా గుర్తించాలో సాధారణ ప్రజలకు మార్గ నిర్దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ రోజుకొక ఆహారం పై ప్రజలలో అవగాహన కల్పిస్తోంది. ఇకపోతే ఈ వారం ఆవాలను ఎలా కల్తీ చేస్తున్నారో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

ఇకపోతే చాలా మందికి అర్జెమోన్ విత్తనాలు ఆవాల గింజల వలె కనిపిస్తూ ఉంటాయి.. అర్జెమోన్ గింజలను  ఆవాల నూనెతో కల్తీ చేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఈ విత్తనాల వల్ల మనకు ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి.. ఇక ఈ కల్తీ ని ఎలా తనిఖీ చేయాలి అంటే.. ముందుగా ఒక గ్లాస్ ప్లేట్ తీసుకొని కొద్ది మొత్తంలో ఆవాలు తీసుకోండి.. కొన్ని ధాన్యపు గింజలు గరుకైన ఉపరితల కలిగి వుండి, గింజలు నలుపు రంగులో ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించండి. కల్తీ లేని ఆవాలు బయటకు చాలా మృదువుగా స్మూత్ గా కనిపిస్తాయి.. అర్జెమోన్ గింజల ఉపరితలం గరుకుగా నలుపు రంగులో ఉంటాయి.. ఇక ఇలా ఈ విషపూరితమైన  గింజలను గుర్తించి తీసివేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: