కరోనా కల్లోలం.. విద్యార్థులకు నష్టం ఎంతో తెలుసా..!

MOHAN BABU
కరోనా కారణంగా బడులు మూతపడడం తర్వాత ఆన్లైన్ క్లాసులు కొనసాగడంతో చాలా మంది స్టూడెంట్స్ చదువులు సాగడం లేదు. బడి పిల్లల ప్రవర్తనలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త అలవాట్లు నేర్చుకున్నారా, ప్రత్యక్ష తరగతులు దూరం కావడంతో స్టూడెంట్స్ నిర్లక్ష్యం ఎక్కడికి దారి తీస్తుందో,వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను వింటే తెలుస్తుంది. దాదాపు సంవత్సరంన్నర కాలం బడులకు దూరమయ్యారు. చాలామంది పిల్లల్లో చదువుపై ఆసక్తి గతంలో ఉన్నట్లు కనిపించడం లేదంటున్నారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇప్పుడు రెండు, మూడు ప్రశ్నలకు కూడా జవాబులు రాయకుండా, చదవకుండా తయారయ్యారు.

 కరోనా కారణంగా స్కూల్స్ క్లోజ్ అవ్వడం, ఆన్లైన్ చదువులతో విద్యార్థులు ఎంతవరకు వంట పట్టించుకుంటున్నారో తెలియడం లేదు. పిల్లలు ఊర్లలో పొలం పనులకు వెళ్లారు.సిటీలో ఉండే వాళ్ళు అయితే  ఫోన్లు,టీవీలకు అతుక్కుపోయారు. కరోనా రెండో వేవ్ తర్వాత సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు మొదలైన వారి ప్రవర్తనలో మార్పులు వచ్చినట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. పిల్లల చదువులు, క్రమశిక్షణ దారి తప్పాయంటున్నారు టీచర్లు.ఓమిక్రాన్ పై వస్తున్న ప్రచారాలతో పేరెంట్స్ లో మళ్లీ టెన్షన్ మొదలైంది. స్కూళ్లలో కరోణ నిబంధనలను కట్టడి చేస్తూనే, పిల్లల భవిష్యత్తు కోసం తగిన నిర్ణయాలు  తీసుకోవాలని కోరుతున్నారు. క్లాసుల్లో కొందరు స్టూడెంట్స్ ని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రభుత్వ బడుల్లోనే కాదు, ప్రైవేట్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ సహా వృత్తి విద్య కాలేజీల విద్యార్థుల్లోనూ ఇలాంటి వ్యవహారశైలే కనిపిస్తుందని అంటున్నారు అధ్యాపకులు.

ఆన్లైన్ పాటాలతో మొబైల్స్ చేతికి రావడంతో పిల్లలు వీడియో గేమ్స్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా కు అలవాటు పడినట్లు కొందరు టీచర్లు గమనించారు. ఉన్నట్టుండి వాటికి దూరం చేస్తే, విద్యార్థుల నుంచి సహజంగానే వ్యతిరేకత వస్తుందని, ఈ విషయంలో పేరెంట్స్ దగ్గరుండి చూసుకోవాలని చెబుతున్నారు. మొత్తంగా పిల్లల్లో క్రమశిక్షణ లోపించినట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆప్యాయంగా మాట్లాడి తమ తప్పును తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం  చాలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: