మీరు ఎక్కువగా దగ్గు,జలుబు వస్తుందా..ఈ విషయాలు తెలుసుకోండి..?

Divya
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా చలికాలం కాబట్టి జలుబు, దగ్గు బారిన పడేవారు ఎక్కువగా ఉంటారు. అయితే తే.గీ ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.. ఒకవేళ దగ్గు ఎక్కువ రోజులు కొనసాగితే.. మందులు వాడినప్పటికీ ఉపయోగం లేకుంటే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి, మన ఊపిరితిత్తులకు సంబంధించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. వాటి గురించి తెలుసుకుందాం.


ఒక ప్రముఖ డాక్టర్ వికాస్ కుమార్ తెలిపిన ప్రకారం.. ఎన్నోసార్లు ప్రజలు ఛాతి నొప్పి, న్యుమోనియా వంటి వాటి పైన ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఎక్కువగా దగ్గు సమస్యతోనే వస్తున్నారు. అలా ఎందుకు వస్తుంది అంటే.. బ్రోన్కైటిస్ లేకుంటే మనిషిలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణం వల్ల అయినా కూడా అలా వస్తుందట. ఎక్కువ రోజులు దగ్గు గాని వస్తే.. ఊపిరితిత్తులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని అర్థమట. ఇది అలాగే ఉంటే నెమ్మదిగా క్యాన్సర్ కు దారితీస్తుందని వైద్యులు తెలియజేశారు. అంతేకాకుండా ఇలాంటి కేసులు చాలా వస్తూనే ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. అందుకు కారణం ప్రజలలోని కొన్ని మార్పుల వల్లే అని అని చెప్పుకొచ్చారు డాక్టర్ వికాస్.

ముఖ్యంగా పొగతాగడం వల్ల, దగ్గు రావడం చాలా కామన్ అని తీసుకుంటూ ఉంటారు. ఇక అదే సమస్యగా మారుతోందని వైద్యులు తెలియజేశారు. ముఖ్యంగా ఒక వ్యక్తి..20 రోజుల కంటే ఎక్కువ కాలం దగ్గుతూ ఉంటే.. అది టీబీ లక్షణం అవ్వచ్చు. ఆని కొంతమంది వైద్యులు తెలియజేశారు. అందుచేతనే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దగ్గు అలాగే వస్తే వైద్యులను సూచించాడం మేలు. వాటి లక్షణాలను ఇప్పుడు చూద్దాం.

1). నోటిలో నుంచి రక్తం రావడం.
2). ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడడం.
3). అమాంతం ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం.
4). నడవడానికి చాలా ఇబ్బంది పడడం.
5). ఎప్పుడు సచ్చుగా ఉండడం.
6). గొంతులో మంట వంటివి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: