గుడ్ న్యూస్ : ఇంజెక్షన్‌తో 15 శాతం బరువు తగ్గిపోవచ్చట?
అయితే ఒకసారి భారీగా పెరిగిన తర్వాత ఇక వ్యాయామశాల వెళ్లి చెమటోడ్చి కష్టపడితేనే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమంది సులువుగా బరువు తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలను వెతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అమెరికాలో ఎక్కువమంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు ఇటీవలే నివేదికలో తేలింది. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాలో విగోవి అనే ఔషధాన్ని భారీగా డిమాండ్ ఏర్పడింది. ఊబకాయంతో బాధపడుతున్నవారికి అందరూ ఇక ఈ మందును కొనడానికి దుకాణాలకు బారులు తీరుతున్నారు. అయితే అమెరికాలో ఉన్న వయోజనుల్లో ఎక్కువమంది స్థూలకాయులే ఉన్నారట. ఈ క్రమంలోనే ఈ ఇంజక్షన్ కు గిరాకీ పెరిగిందని తెలుస్తోంది.
ఇంతకీ ఇంజక్షన్ స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారు కదా.. ఈ ఇంజక్షన్ తీసుకున్నారు అంటే చాలు ఏకంగా 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందట. డెన్మార్క్‌కు చెందిన నోవో నార్దిస్క్ అనే కంపెనీ ఇక ఈ ఇంజెక్షన్లు తయారుచేసింది. దీనికి అమెరికా ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లభించాయి. దీంతో ఇక అమెరికాలో ఇంజక్షన్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. వారానికి నాలుగుసార్లు ఔషధాన్ని తీసుకుంటే ఆకలిని నియంత్రించి బరువు తగ్గేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.