అద్భుతం.. పంది మూత్రపిండాలు మనిషికి?
ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు నిలబెట్టడానికి వినూత్నమైన ప్రయోగాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఇప్పటివరకు ఒక మనిషి గుండె ను మరో మనిషికి అమర్చి ప్రాణం నిలబెట్టడం లాంటివి చూసాం. అంతేకాకుండా వేరొకరికి సంబంధించిన వివిధ అవయవాలను మరొకరికి అమర్చడం లాంటివి కూడా జరిగింది. అయితే ఇక్కడ మాత్రం వైద్యులు అద్భుతం చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఒక మహిళకు మూత్రపిండాలు చెడిపోయాయి. ఈ క్రమంలోనే ఆమెకు కొత్త కిడ్నీలు అమర్చి ప్రాణం నిలబెట్టారు.
ఇలా కొత్త కిడ్నీలు అమర్చి ప్రాణం నిలబెట్టడంలో కొత్త ఏముంది అని అంటారా.. అయితే సదరు మహిళకు అమర్చింది మరో మనిషి కిడ్నీలు కాదు ఏకంగా ఒక పంది మూత్రపిండాలు. మూత్రపిండాలు చెడిపోయిన ఆ మహిళకు కిడ్నీలు దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే ఆమె ప్రాణం నిలబెట్టాలి అనుకున్న వైద్యులు ఏకంగా పంది మూత్రపిండాలను తీసుకుని వాటిని ఆమెకు మార్పిడి చేశారు. ఇక ఈ ఆపరేషన్ చేసేందుకు మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు వైద్యులు ఇక ఈ ఆపరేషన్ తర్వాత బాధిత మహిళ కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది.