కెనడా : మరో ప్రకృతి ప్రకోపం..!

Chandrasekhar Reddy
సాంకేతిక పరిజ్ఞానం పేరిట సహజమైన ప్రకృతిని నాశనం చేస్తున్న మనిషికి అదే శత్రువుగా మారుతుంది. మనిషి ఎంతగా ప్రకృతికి శత్రువుగా మారుతున్నాడో అదే తరహాలో మనిషి ప్రకృతి వైపరీత్యాలకు గురిఅవుతూ బాధించబడుతున్నాడు. ప్రపంచంలో కారణం తెలియని వ్యాధులు ఇప్పటికే అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం కూడా కరోనా లాంటి వైరస్ తో పోరాటం చేస్తుంది అంటే అది కూడా ప్రకృతి ప్రకోపమే అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏ భూకంపమో, సునామినో, భారీ తుఫానులని చెప్పుకునేవారు. కానీ కరోనా తరువాత అంతు తెలియని వైరస్ లు కూడా ఈ కోవలోకే వస్తాయన్నది గుర్తించాలని వారు అంటున్నారు.
ప్రకృతి సిద్ధంగా మనిషిని బ్రతకమని అన్ని సౌకర్యాలతో భూమిని ఇస్తే, ఇంకా ఇంకా అంటూ అనేక అత్యాశలతో, సాంకేతికత అంటూ తన గొయ్యి తానే తొవ్వుకుంటున్నాడు. ఇప్పటికే ప్రపంచంలో వేడి ఎక్కువ అయ్యి, మంచుకొండలు కరిగిపోతున్నాయి. వాతారణంలో కూడా  తీవ్రమైన మార్పులు వచ్చేస్తున్నాయి. అతివేడి, అతి చలితో సహవాసం చేయాల్సి వస్తుంది మనిషి. అయితే ఈ సమస్యలను చిన్నవిగా భవిస్తూ వాటినుండి తప్పించుకోవడానికి చిన్న చిన్న మార్గాలతో మరోసారి ప్రకృతిని నాశనం చేస్తూనే ఉన్నాడు. తాను మాత్రమే బ్రతికితే చాలు అనే స్థాయికి మనిషి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. నిజానికి సృష్టిలో మనిషే అతి ముఖ్యమైన ప్రాణి. ముఖ్యత్వం  ఎందుకంటె, దాని ద్వారా ఇతర జీవరాశులకు తోడుగా, వాటి అవసరాలను కూడా తీరుస్తూ ఉండాలన్నది సృష్టి నియమం.
అసలు అదే ఆహార చక్రం కూడా చెబుతుంది. ఒక్క చోట ఆహార చక్రం దెబ్బతిన్నా కూడా సృష్టి మనుగడ దెబ్బతింటుంది. అనే ఏ జీవరాశి కూడా జీవించడానికి కుదరని పరిస్థితి వచ్చేస్తుంది. మనిషి ఇతర జీవాలతో కలిసి జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రకృతి చెపితే, తాను మాత్రం ఇదంతా కేవలం తనకోసమే అంటూ అత్యాశకు పోవడం వలననే ఈ అంతుచిక్కని వ్యాధుల రూపంలో ప్రకృతి మనిషిని హరించి వేస్తుంది. తాజాగా కరోనా కాకుండానే మరో అంతు చిక్కని వ్యాధి కెనడాలోని బ్రన్స్విక్ ప్రావిన్స్ లో వెలుగు చూసింది. దీనితో ఇప్పటికే 48 మంది మృతిచెందారని అక్కడి అధికారులు, మీడియా స్పష్టం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: