టైఫాయిడ్ : కారణం భగీరథ నీరేనా..?

MOHAN BABU
దేశం అబ్బురపడి పథకం.. అధికారులు భగీరథ జలాల తప్ప మరే నీళ్లు తాగద్దు. అధికారిక సమావేశాల్లోనూ వాటినే వినియోగించాలి ఇది సర్కారు ఆదేశం. కానీ మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీల కారణంగా నీరు కలుషితం అవుతుంది. ఆ నీటిని తాగిన వారు టైఫాయిడ్ బారిన పడుతున్నారు. ఒక చోట లీకేజీని అరికట్టే లోపే మరో చోట అదే సమస్య తలెత్తుతుంది. జోరుగా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపై ఆగిన మురికి నీరంతా పైప్ లైన్ లోకి చేరుతుంది. సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియా ఆ నీటిలో  కలుస్తున్నట్లు తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్  కార్పొరేషన్ లోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా కారణంగా జోరుగా టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన మిషన్ భగీరథ నీటి  ద్వారా టైఫాయిడ్  వ్యాప్తి చెందుతుంది.

రిజర్వాయర్ నుంచి శుద్ధ జలాలను ఇళ్లకు తరలించేందుకు ఏర్పాటుచేసిన పైపుల లీకేజీలతో టైఫాయిడ్ కు కారకమైన సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా ఆ నీటిలో  కలుస్తున్నట్లు తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని చోట్ల రిపేర్లు చేసినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో లీకేజీని అరికట్టలేక పోతున్నామని వివరించారు.

 పైగా వర్షాల కారణంగా వచ్చే వరదలతో లీకేజ్ లను గుర్తించడం తమ సిబ్బందికి కష్టతరమవుతున్నదని ఆయన చెప్పడం గమనార్హం. వానాకాలం ప్రారంభం కాకముందే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. కానీ వేగంగా మరమ్మతులకు నోచుకోక పోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆయన తెలిపారు. నీటిలోని బ్యాక్టీరియాను నశింపచేసెందుకు బ్లీచింగ్ కలుపుతున్నప్పటికీ పైపుల లీకేజీలతో వృధా అవుతుందన్నారు . గతంతో పోలిస్తే ఈసారి టైఫాయిడ్ జ్వర పీడితులు పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: