అమ్మ స్వరమే చిన్న పిల్లలకు శ్రీరామరక్ష..!

MOHAN BABU
నెలలు నిండకుండానే పుట్టే శిశువు శరీర భాగాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందవు. దీంతో వారికి వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారి పెరుగుదల పై ప్రభావం పడుతుందని పిల్లల్లో నొప్పులు, బాధ కూడా అధికంగా ఉంటుందని గత పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఇలాంటి సమయంలో తల్లిని,పిల్లలకు దగ్గరగా ఉంచి ఆమె గొంతు వినిపించడం వల్ల బాధ,నొప్పి కొంతమేర తగ్గుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ పరిశోధనను సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్ లో ప్రచురించారు. ఈ వివరాలు ఏంటో మనమూ తెలుసుకుందాం. సాధారణంగా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలను వారి తల్లులకు దూరంగా తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రత్యేక ఇంకుబేటర్ లో ఉంచి చికిత్స అందిస్తారు. క్రమం తప్పకుండా మందులు ఇస్తూ రక్షించే ప్రయత్నం చేస్తారు అయితే కొన్నిసార్లు ఈ వైద్య పరిస్థితులు వారి ఎదుగుదలకు ప్రమాదకరంగా మారుతాయి.

శిశువు ఆరోగ్యాన్ని మెరుగు పరచాలనే ఉద్దేశంతో జెనీవా వర్సిటీ పరిశోధకులు ఇటలీలోని పరి హాస్పిటల్ వల్లే డీఓస్టా విశ్వవిద్యాలయంతో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. తల్లి శిశువు తో మాట్లాడినప్పుడు పిల్లల్లో ఆక్సిటోసిన్ స్థాయిలను అంచనా వేశారు. దీని ద్వారా నెలలు నిండకముందే జన్మించిన శిశువుల్లో నొప్పి తగ్గుతుందని గుర్తించారు. ఈ పరిశోధనా తల్లితో సాన్నిహిత్యాన్ని హైలెట్ చేస్తుంది. ఇటలీలోని పరిని ఆస్పత్రిలోని 20 మంది నెలలు నిండకముందే జన్మించిన శిశువు ల పై పరిశోధన చేశారు . వీరి మడమ నుంచి కొన్ని చుక్కల రక్తం సేకరించడం ద్వారా రోజువారీ రక్తపరీక్ష చేశారు. మూడు రోజుల పాటు మూడు దశల్లో ఈ ప్రయోగం జరిగింది. తల్లి లేకుండానే మొదటి ఇంజక్షన్ ఇచ్చారు. రెండోది శిశువుతో తల్లి మాట్లాడుతుండగా ఇచ్చారు. మూడో ఇంజక్షన్ శిశువు దగ్గర తల్లి పాడుతుండగా ఇచ్చారు.

నవజాత శిశువులకు వైద్య ప్రక్రియ సమయంలో తల్లి పక్కనే ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ లాంటి సున్నితమైన వాతావరణంలో తల్లిదండ్రులు పిల్లలను కలిపే ప్రాముఖ్యతను అధ్యయనం గుర్తిస్తుందనిఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు మాన్యులా ఫిలిప్ప తెలిపారు. తల్లిదండ్రులు ఇక్కడ రక్షణాత్మక పాత్ర పోషిస్తారు. తమ బిడ్డకు సాధ్యమైనంతవరకు దగ్గరగా ఉండటానికి ఈ రీసెర్చ్ సహాయపడుతుంది. ఇది పూర్తిగా తల్లీబిడ్డల బంధాలను బలపరుస్తుంది అని డిడియర్ గ్రాండ్ జీన్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: