డిప్రెషన్ నుంచి బయట పడాలంటే...

Purushottham Vinay
కరోనా మహమ్మారి గత ఒకటిన్నర సంవత్సరాలలో చాలా మంది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా మహమ్మారి సమయంలో డిప్రెషన్ కి గురైన వారు ఇంకా సోషల్ మీడియా వ్యసనం కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుండి వచ్చిన వైద్యుల బృందం తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా అనేక లాక్డౌన్లు ఏర్పడ్డాయి. కోవిడ్ లాక్డౌన్ మధ్య బహిరంగ కార్యకలాపాలపై ఆంక్షల కారణంగా విద్యార్థులు ఇంకా పిల్లలు తమ ఇళ్లకే పరిమితం చేయబడ్డారు.ఇది ఎక్కువగా యూత్ కు చిరాకు, అస్థిరమైన నిద్ర, ఆకలి సమస్యలు ఇంకా బరువు పెరగడానికి దారితీసింది. డాక్టర్ సందీప్ వోహ్రా, సీనియర్ కన్సల్టెంట్, మెంటల్ హెల్త్ అండ్ సైకియాట్రి, మీడియా నివేదికల ప్రకారం, "యువత కోసం OPD సంప్రదింపుల సంఖ్య ఆందోళన, డిప్రెషన్, గేమింగ్, ఇంకా సోషల్ మీడియా వ్యసనం ఇంకా అధ్యయనాలపై దృష్టి పెట్టడం అలాగే దృష్టి పెట్టలేకపోవడం రెండింతలు అయ్యింది.ఇక వీళ్ళు ఈ మానసిక స్థితి నుండి బయటపడాలంటే వారి ఇంట్లో కాని లేక వారి పిల్లలతో మంచి సంబంధాన్ని కొనసాగించాలని అలాగే వారితో క్రమం తప్పకుండా మాట్లాడాలని,అందువల్ల వారిలో ప్రవర్తనా మార్పులను గమనించవచ్చని డాక్టర్స్ సూచించారు.

2021 లో ఉన్న ఇలాంటి కేసుల సంఖ్యను 2019 తో వైద్యులు పోల్చి చూశారని, ఇది వారి నిర్ధారణకు సహాయపడిందని ఆసుపత్రి ప్రతినిధి చెప్పారు. మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ కారణంగా స్క్రీన్ సమయం ఇంకా ఇంటర్నెట్ వినియోగం పెరుగుదల గురించి వైద్యులు మాట్లాడారు.ఈ మహమ్మారి సమయంలో పిల్లలు ఇంకా యూత్ ఎక్కువగా ఇంట్లో ఉండటం వలన వారి రోజువారీ శారీరక శ్రమ తగ్గింది. కరోనా పాఠశాల ఇంకా కళాశాల విద్యార్థుల ప్రవర్తనా లక్షణాలపై చాలా తీవ్రంగా ప్రభావం చూపింది. ఈవన్ని కారకాలు, మహమ్మారి సమయంలో  వారిలో ఆందోళన ఇంకా నిస్సహాయత భావనను ప్రేరేపించాయి.ఎండార్ఫిన్స్, సెరోటోనిన్ ఇంకా డోపామైన్ వంటి కొన్ని హార్మోన్లు ఉన్నాయని, ఇవి శారీరక శ్రమ సమయంలో విడుదలవుతాయి. ఇంకా మనస్సును ప్రశాంతంగా అలాగే సంతోషంగా ఉంచగలవని వైద్యులు పేర్కొన్నారు. విద్యార్ధులలో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి తల్లిదండ్రులు ఇంకా ఉపాధ్యాయులు ఒక అడుగు వేయాలని వారు అన్నారు.ఈ సమస్యలు పిల్లలలో కొనసాగితే, వారు వృత్తిపరమైన సహాయం పొందాలని వైద్యులు సూచించారు. కౌమారదశ అనేది జీవితంలో అభివృద్ధి చెందుతున్న దశ అని ఇంకా ఈ దశలో ఏదైనా శారీరక,మానసిక ఆరోగ్య భంగం ఆ వ్యక్తి భవిష్యత్తు అనుభవాలకు ఆటంకం కలిగిస్తుందని కూడా వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: