పైల్స్ తో బాధపడుతున్నారా? అయితే ఇవి తినండి..

Purushottham Vinay
చాలా మంది కూడా పైల్స్ వ్యాధితో చాలా నరకయాతన అనుభవిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఈ సమస్యతో చాలా ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు. ఇక ఈ పైల్స్ సమస్య మలద్వారం లోపల అలాగే చుట్టూ వాపు వచ్చి పెరిగే కణితులలాగా ఏర్పడుతుంది. ఈ సమస్యనే పైల్స్ అంటారు.ఈ పైల్స్‌ సమస్యను నివారించుకునేందుకు చాలా మంది కూడా ఎన్నెన్నో మందులు వాడ‌తారు.కాని ఎలాంటి ప్రయోజనం ఉండదు.ఇక అలాగే కొంతమంది ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఆప‌రేష‌న్ కూడా చేయించుకుంటారు.అయితే కొన్ని కొన్ని ఆహార పదార్ధాల ద్వారా ఈ పైల్స్ స‌మ‌స్య‌కు మనం శాశ్వతంగా చెక్ పెట్ట‌వ‌చ్చు.ప‌చ్చి ఉల్లిపాయ పైల్స్‌ను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.ప‌చ్చి ఉల్లి పాయని డైరెక్ట్‌గా తినడం లేదా ర‌సం రూపంలో తీసుకోవ‌డం చేస్తే పైల్స్ సమస్య ఇంకా పైల్స్ ల‌క్ష‌ణాలు దూరం అవుతాయి.అలాగే కొన్ని పండ్లు పైల్స్ వ్యాధిని చాలా ఈజీగా త‌గ్గించ‌గ‌ల‌వు.

ఇక అలాగే అర‌టి పండ్లు, దానిమ్మ పండ్లు, అంజీర పండ్లు, మామిడి పండ్లు ఇంకా బొప్పాయి పండ్లు వంటివి వారి డైట్‌లో ఉండేలా చూసుకుంటే పైల్స్ సమస్య తగ్గి మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే పైల్స్‌ సమస్యను స‌హ‌జంగా తగ్గించడంలో ప‌సుపు కూడా ఎంతగానో ఎఫెక్టివ్‌గా సహాయ‌ప‌డుతుంది.కాబట్టి ఈ సమస్యని తగ్గించడానికి పసుపుని వాడితే చాలా మంచిది.ఇక ప‌సుపును ఈ సమస్య నుంచి తగ్గించుకోడానికి ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.పైల్స్ సమస్యతో చాలా తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌య్యే వారు ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో ఒక స్పూన్ అల్లం ర‌సం అలాగే ఒక స్పూన్ నిమ్మ ర‌సం ఇంకా ఒక స్పూన్ తేనె క‌లుపుకుని సేవించితే ఈ సమస్య వెంటనే తగ్గిపోతుంది.ఇక అలాగే ఈ సమస్య తీవ్రంగా ఉన్న వారు వాట‌ర్‌ను ఎక్కువ‌గా తాగాలి. అలాగే ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు ఇంకా మాంసాహరం వంటి ఆహార పదార్ధాలకు చాలా దూరంగా ఉండాలి.మ‌ద్యపానం ఇంకా ధూమ‌పానం అల‌వాట్ల‌ను కూడా పూర్తిగా మానుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: