రంగు మార్చుకున్న భగీరథ నీరు.. తాగితే అంతేనా..?

MOHAN BABU
ఇంటింటికి నల్ల ద్వారా పారిశుద్ధ  జలాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. కోట్లాది రూపాయలతో పైపులైన్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ఇంటింటికి నల్ల కలెక్షన్లు కూడా ఇచ్చింది. ఇది చేసినటువంటి నల్ల నీరు ఇంటికి చేరే సరికి  రంగు మారుతుంది. మరి ఈ నీరు రంగు ఎందుకు మారుతుంది..? ఆ నీటిలో ఏమైనా మాయ మంత్రాలు ఉన్నాయా..? అది తాగితే మనకు మంచిదా.. కాదా అని అనుమానాలు  ప్రజలకు తలెత్తుతున్నాయి. అసలు నీరు రంగు ఎందుకు మారుతుంది.. అది తాగుతున్న ప్రజల పరిస్థితి ఏమిటి..? అది రంగు మారడానికి కారణం ఇదేనా..? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధ జలాన్ని   ప్రభుత్వం అందించాలనే లక్ష్యంతో  మిషన్ భగీరథ పథకాన్ని చాలా పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టింది.


ఇంటికి నల్ల కలెక్షన్ కూడా ఇప్పించి, నీటిని సరఫరా చేస్తోంది. కానీ ఆ నీరు  రంగుమారి ప్రజలకు అందుతోంది. అసలే వానాకాలం ఆపై  సీజనల్ వ్యాధులు విజృంభించే సమయం. దీనికి తోడుగా కురుస్తున్న వర్షాలు, ఇక ఈ రంగుమారిన నీళ్లు తాగితే  మనిషి తప్పకుండా ఆసుపత్రి పాలవడం కాయం. ఇలా చాలాచోట్ల  మిషన్ భగీరథ నీరు  ఏదో ఒక విధంగా కలుషితమవుతోంది. అందుకే నియోజకవర్గ ప్రజలు, గ్రామ పంచాయతీల ప్రజలు ఈ నీటిని ఉపయోగించకుండా ప్రైవేట్ వాటర్ ప్లాంట్ వైపు పరుగులు తీస్తున్నారు. ఈ విధంగా పలు గ్రామాలలో పలు గ్రామాలలో వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా  కలుషిత నీరు సరఫరా అవుతోంది. నీటిని ఫిల్టర్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తుండటంతో  రంగుమారి ప్రజలు వినియోగించుకు నేందుకు ఆసక్తి కనబరచడం లేదు. తాగడానికి కాదు కదా, కనీసం వంట పాత్రలు కూడా శుభ్రం చేసుకునేందుకు పనికిరాకుండా పోతున్నాయి.


కోట్లాది రూపాయలు వెచ్చించి జిల్లాలో ఇంటికి నల్ల కలెక్షన్ ఇచ్చి ఈ విధంగా నీటిని కలుషితంగా  అందిస్తే  పరిస్థితి ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ఈ యొక్క కలుషిత నీరు కరీంనగర్ జిల్లా తో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాలలో, నియోజక వర్గాలలో ఇలా నీరు కలుషితమై వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో చోట్ల మిషన్ భగీరథ నీరు  వచ్చినా కూడా దానిని ఉపయోగించడానికి ఆసక్తి చూపడం లేదు. దీనిపై  అధికారులు కూడా శ్రద్ధ చూపకపోవడంతో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు నీరు గారి పోయే అవకాశం ఉంది అని ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: