కడుపునొప్పి తగ్గాలంటే ఇలా చెయ్యండి

Purushottham Vinay
కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించడంలో పుదీనా ఒక మంచి హోం రెమడీ అని చెప్పవచ్చు. సాధారణంగా కొన్ని పుదీనా ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకొని బాగా నమిలి మ్రింగాలి.అప్పుడు కడుపు నొప్పి తగ్గిపోతుంది.లేదా పుదీనా ఆకులను వేసి బాగా టీ తయారు చేసుకొని రోజు త్రాగితో కడుపు నొప్పి నుండి తక్షణమే మంచి ఉపశమనం పొందవచ్చు.ఇక అలోవెరా కూడా ఆరోగ్యపరంగా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలోవెరాలో అనేక రకాల ఔషధగుణగణాలున్నాయి. అలోవెరా క్రిములతో పోరాడుతుంది. ఇంకా కడుపు నొప్పికి నుండి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒక కప్పు అలోవెరా జ్యూస్ రోజు తాగడం వల్ల అనేక రకాలైన పొట్ట, ప్రేగు సంబంధిత సమస్యలనేవి తగ్గిపోతాయి. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలతో పాటు కడుపులో తిమ్మెర్లను నివారించడంలో ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.


ఇక లెమన్ జ్యూస్ కూడా కడుపు నొప్పికి చాలా మంచిది. లెమన్ జ్యూస్ ని గోరువెచ్చని నీటి కాంబినేషన్ తో కలిపి తీసుకుంటే తప్పకుండా కడుపు నొప్పి నుండి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో కొంచెం నిమ్మరసం పిండి అందులో కొద్దిగా తేనెను మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి తీసుకుంటే తప్పకుండా కడుపు నొప్పి నుండి మంచి ఉపశమనం కలిగుతుంది.ఇక అల్లం కూడా కడుపు నొప్పి నివారణకు చాలా మంచిది. అల్లంలో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి.అలాగే ఇతర కొన్ని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వల్ల కూడా అల్లం అజీర్తి వంటి లక్షణాలను తగ్గించి కడుపు నొప్పిని శాశ్వతంగా నివారిస్తుంది. ఇక అల్లం ఎండిన దానికంటే, తాజాగా ఉన్నది కడుపు నొప్పి తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.అలాగే కడుపు నొప్పి నుండి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఇక అలాగే తాజాగా ఉండే అల్లంను టీ చేసుకొని రోజు తాగితే ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: