ఇలాంటి కలలు మీకెప్పుడైనా వచ్చాయా.. అయితే వాటి సంకేతాలు ఇవే?

praveen
ప్రతి మనిషి జీవితంలో నిద్రలో కలలు రావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అందరికీ ఒకే రకం కలలు రావు అన్నది తెలిసిందే. కొంత మందికి కొన్ని రకాల కలలు వస్తే మరికొంతమందికి చిత్ర విచిత్రమైన కలలు వస్తూంటాయి. ఇంకొంత మందికి పీడ కలలు కూడా వస్తూ నిద్రను పాడు చేస్తూ ఉంటాయి.  ఇలా నిద్రలో వచ్చే కలలకు  కూడా కొన్ని కారణాలు ఉంటాయి అని అప్పుడప్పుడూ నిపుణులు చెబుతుంటారు.  ముఖ్యంగా నిద్రలో వచ్చే కొన్ని రకాల కలలు కొన్ని సంకేతాలు కు కారణం అవుతాయి అని అంటూ ఉంటారు.

 అంతేకాదు ఇక గాఢమైన నిద్ర లో ఉన్నప్పుడు వచ్చే వివిధ రకాల కలలు మన భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా అప్పుడప్పుడు ఇండైరెక్టుగా తెలియజేస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు ఇంకొంతమంది.  ఊరుకొండి బాసూ.. కలలో వచ్చేవి భవిష్యత్తును తెలియజేయడమా..ఇదంతా ఒట్టి ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు ఈ మాట చెబితే ఎవరైనా.  కానీ నిద్రలో వచ్చే కలలకు ఇక నిజ జీవితంలో జరగబోయే ఘటనలకు కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి అని అంటున్నారు కొంతమంది నిపుణులు. అన్ని రకాల కలలు కాదు కేవలం కొన్ని రకాల కలలు కు మాత్రమే  ఇలా భవిష్యత్తుతో సంబంధం ఉంటుంది అని చెబుతున్నారు.

 ఇలా ఒక్కొ కలకు ఒక్కో రకం అర్థాలు ఉన్నాయి అని అంటున్నారు. సాధారణంగా చాలామందికి కలల్లో మంటలు కనబడుతూ ఉంటాయి  అయితే ఇలా కలలో మంటలు వస్తే మీరు ఊహించినది ఎదో జరగబోతుందని అర్థమట.  ఇక గర్భంతో ఉన్నట్లు కల వస్తే జీవితంలో మరికొన్ని రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగబోతున్నట్లు అర్థం వస్తుందట. అంతేకాదు కలలో చేపలు పడుతున్నట్లు వస్తే లేదా ఇక నిండుగా పళ్ళు కాసిన చెట్టు కనిపిస్తే త్వరలో ఎక్కడినుంచో డబ్బు రాబోతుంది అనే సంకేతం ఉంటుందట. అంతేకాకుండా ఇక గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు కలలో ఏదైనా పర్వతం లాంటిది వచ్చింది అంటే ఇక మరికొన్ని రోజుల్లోనే మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు అని అర్థం వస్తుందట.  ఇలా కలలకు కూడా సంకేతాలు ఉన్నాయి అని అంటున్నారు కొంతమంది. ఇలాంటిది ఎప్పుడు అయినా మీకు కల వచ్చిందా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: