గ్యాస్ట్రిక్, గుండెపోటు.. లక్షణాలు ఒకేలా ఉన్నా.. ఇలా గుర్తించొచ్చు?
ఒకవేళ ఆహారం తీసుకున్న ఇక జంక్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి అజాగ్రత్తల వలన ఎంతో మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు ఇక ఒక్కసారి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది అంటే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాతిలో కడుపులో మంటతో ఎంతో మంది అవస్థలు పడుతూ ఉంటారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారిలో కనిపించే లక్షణాలు.. గుండెపోటు వచ్చే వారికి ముందు కనిపించే లక్షణాలు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇక ఈ రెండు లక్షణాలు విషయంలో అప్పుడప్పుడు అయోమయంలో పడి పోతూ ఉంటారు జనాలు.
ఈక్రమంలోనే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు చాతిలో నొప్పి లాంటిది వచ్చినప్పుడు ఇక వెంటనే గుండె పోటు వస్తుందేమో అని మరింత భయపడిపోతుంటారు. అయితే వీటిని ఎంతో సులభంగానే గుర్తించ వచ్చు అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అజీర్తి, గ్యాస్ సమస్య వల్ల కడుపులో ఛాతిలో మంటగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అందరూ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా టాబ్లెట్ వేసుకున్న సమయంలో తగ్గకపోతే మరో టాబ్లెట్ కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఒకటి రెండు సార్లు టాబ్లెట్ వేసుకున్న ప్పటికీ కడుపు గుండెల్లో మంట తగ్గకపోవడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అంతేకాకుండా శరీరమంతా చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే అది గుండె పోటుకు సంకేతం అని భావించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలి అంటూ సూచిస్తున్నారు.