స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. ఇవి పాటించండి చాలు

Purushottham Vinay
ఇక ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి తినని తిండి సరైన సమయానికి పడుకోని నిద్ర అసలు పగలు రాత్రి అనే బేధం లేని ఉద్యోగాలు. అవి అసలు పూర్తిగా పగలు పని చేసి.. రాత్రి నిద్రపోవాలి అనే నియమం మార్చేస్తున్నాయి.దీనికి తగ్గట్లుగా తినే తిండి రసాయనాల మయం కూడా అంతే వుంది. ఇక దీంతో ఆడ, మగ , చిన్న పెద్ద అనే బేధం లేకుండా అందరూ కూడా జబ్బుల పాలవుతున్నారు. ఇక ఈ రోజుల్లో చాలా మంది పురుషులు ఎక్కువగా వీర్య కణాల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. అందువల్ల వారికి సరిగ్గా పిల్లలు కలగడం లేదు.దీంతో మానసికంగా వారు చాలా వేధనకు గురి అవుతున్నారు. అయితే వీర్య కణాల అభివృద్ధికి చాలా మంది కూడా వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి ఆసుపత్రి పాలవుతున్నారు. అయితే అంత ఖర్చు పెట్టాల్సిన పనే లేదు.మనం తినే తిండిలో కొద్దిగా మార్పులు చేసుకొంటే చాలు అని ఆయుర్వేద నిపుణులు తెలుపున్నారు.. మనం తినే శనగలతో పురుషులు వీర్య కణాల సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చునని నిపుణులు అంటున్నారు.

ఒక కప్పు శనగలు తీసుకొని రాత్రి పూట వాటిని బాగా నానబెట్టి ఉదయాన్నే వాటిలో ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తింటే చాలా మంచిది. అలా రోజూ చేస్తే.. చాలా త్వరగా వీర్య కణాల అభివృధ్ధి జరుగుతుందట.ఇక అలాగే ఒక గుప్పెడు శనగలు ఇంకా 5 బాదం పప్పులను రాత్రి పూట నీటిలో నాన బెట్టి రోజు ఉదయాన్నే పరగడుపున తినాలి. తిన్న తర్వాత ఓ గ్లాసు గోరు వెచ్చని పాలు తాగాలి.. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు పాటిస్తే వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుంది.అలాగే రాత్రి పూట నానబెట్టిన శనగలను ఉదయాన్నే బెల్లంతో కలిపి తింటే చాలా మంచిది..ఖచ్చితంగా శృంగార సామర్ధ్యం పెరుతుంది.. వీర్య కణాలు బాగా వృధ్ధి చెందుతాయి…ఇంకా రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం నేతిలో వేయించి వాటిని తినాలి. వాటిని తిన్న తరువాత ఓ గ్లాసు వేడి పాలను తాగాలి.ఇక ఇలా కొన్ని రోజులు రోజూ పాటిస్తే వీర్య కణాల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతుంది.ఇంకెందుకు ఆలస్యం ఇక క్రమం తప్పకుండా ఇలా చెయ్యండి. వీర్య కణాల అభివృద్ధిని పెంచుకోండి. నిత్యం ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: