బతికే ఛాన్స్ లేదు.. పుట్టినరోజు వేడుకలు..!
అతని బరువు 340 గ్రాములు. 26 సెంటీమీటర్ల పొడవుగా ఉన్నాడు. నిజానికి బెత్ హచిన్సన్ డెలివరీ సమయం 2020 అక్టోబర్ 13. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ముందే బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీశారు. దీనిపై వైద్యులు బెత్ హచిన్సన్ భర్త రిక్ హచిన్సన్ తో వైద్యులు తీవ్రమైన చర్చలు చేసిన తర్వాత బిడ్డను బయటకు తీశారు. ఆ బుడతడు జన్మించినప్పుడు, కేవలం 340 గ్రాముల బరువు, 26 సెంటీమీటర్ల పొడవుతో అరచేతిలో సరిపోయే విధంగా ఉన్నాడు. ఇతడి బరువు పూర్తికాలం నవజాత శిశువు బరువులో పదో వంతు ఉన్నాడన్న మాట.
బతకడం జీరో ఛాన్స్ అన్న వైద్యులు రిచర్డ్ స్కాట్ హచిన్సన్ పుట్టినప్పుడు మిల్లియా పలీస్లోని చిల్డ్రన్స్ మిన్నెసోటా దవాఖానాలో డాక్టర్ నియోనాటలజిస్ట్ స్టెపి కెర్న అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి 40 వారాల సమయం పడుతుందని ఆయన అన్నారు. గతంలోనే కెనడా ఒట్టావాలో బ్రేడా జీన్స్ గిల్ దంపతులకు 1987, మే 20 న జన్మించిన జేమ్స్ ఎల్జిన్ గిల్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉండేది. జేమ్స్ తల్లి గర్భంలో 21 వారాల ఐదు రోజులు మాత్రమే ఉన్నాడు. రిచర్డ్ స్కాట్ విలియం ప్రపంచంలోనే అరుదైన చరిత్ర సృష్టించాడు. జేమ్స్ ఎల్జిన్ గిల్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను ఈయన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ప్రపంచంలో ఇలాంటి అరుదైన సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ బుడతడు మాత్రం తన మొదటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు.