ప్రపంచ పాల దినోత్సవం ఏ కారణం వల్ల జరుపుకుంటున్నామో తెలుసా?
కానీ ఈసారి కరోనా వైరస్ కారణంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆయా దేశాలు ప్రకటించాయి. మన నిత్య జీవితంలో పాలు, పాల ఉత్పత్తుల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవటమే ఈ ప్రపంచ పాల దినోత్సవం వెనకున్న ముఖ్యమైన లక్ష్యం. 100% పోషక విలువలు, విటమిన్ బి12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు టీనేజీ పిల్లల్లో విద్యార్థుల్లో మానసిక శారీరక ఉత్సాహాన్ని, పెరుగుదలని, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. రానురాను వాతావరణ సమతుల్యం లోపం వలన వర్షాలు సరిగా పడగా మేత సరిగ్గా దొరకక పశుపోషణ కష్టమైంది.
దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ పాలను మంచి వ్యాపార వస్తువుగా మలచుకుని అనేక డైరీలు వెలిశాయి. అయితే డైరీల్లో పాలు నిల్వ ఉండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు వీటి వల్ల పోషకాలు సంఖ్య తగ్గిపోతోంది. పాల ఉత్పత్తుల్లో ప్రపంచంలో అగ్రభాగాన ఉన్న వినియోగంలో మాత్రం పూర్తిగా వెనకబడ్డాం. ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్ 1 నుండి ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు. కల్తీ లేకుంటే పాలకు మించిన పోషకాహారం లేదు. కల్తీ జరగకుండా ప్రభుత్వమే నిరంతర పర్యవేక్షణ చేయాలి. చిన్న పెద్ద డైరీలు సహకార సంఘాలు నష్టాల బారిన పడకుండా చూడాలి.