టీ తాగితే క్యాన్సర్, గుండె జబ్బులు మాయం...
చామోలి టీ....చమోలి టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టీని చాలా మంది తాగుతూనే ఉంటారు.దీని వల్ల లేడీస్ కి పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది మరియు నిద్రలేమి సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోయి మంచి నిద్ర పడుతుంది. అదే విధంగా రిలాక్స్‌గా ఉంచుతుంది. ఒత్తిడి ఏమైనా ఉంటే కూడా దూరం అయిపోతుంది.
పెప్పర్మెంట్ టీ...ఇది కడుపుని శుభ్రంగా ఉంచుతుంది. కాన్స్టిపేషన్ వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. అదే విధంగా మైగ్రేన్, తల నొప్పి వంటి సమస్యలు కూడా ఇది చిటికె లో పరిష్కారం చూపిస్తుంది. నొప్పి వంటి వాటి నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.
అల్లం టీ...అల్లం టీని సులువుగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొద్దిగా అల్లాన్ని దంచి నీళ్లలో మరిగించి వడకట్టి తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయాన్నే లేవ గానే కొంచెం బద్దకంగా ఉంటుంది. దాని నుండి బయట పడాలంటే ఈ అల్లం టీ ఏ కరెక్ట్. అలానే దీనిని తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు కూడా తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది.
వైట్ టీ..వివిధ రకాల కాన్సర్స్‌ని తగ్గించడానికి ఈ టీ ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కంటికి కూడా వైట్ టీ చాలా మంచిది. వైట్ టీ లో ఫ్లోరైడ్ అధికంగా ఉంటుంది. ఇవి దంతాలుని బలంగా ఉంచుతాయి. ప్లేగు వంటి సమస్యలతో కూడా ఫైట్ చేసే గుణాలు దీనిలో ఉన్నాయి. ఇందులో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది