కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. కరోనా వెళ్లిపోయిందిలే అనుకునే లోపే సెకండ్ వేవ్ రూపంలో వచ్చి ఊపిరాడకుండా చేస్తుంది. మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్ లు రూపొందించినా కొత్త కొత్త రూపాల్లో వచ్చి ప్రాణాలను తీస్తోంది. అయితే అన్ని రకాల కరోనా వేరియంట్ లకు చెక్ పెట్టేలా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకాను డ్యూక్ యూనివర్సిటీ హ్యూమన్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ కు చెందిన బార్టన్ ఎఫ్ హేన్స్ నేత్రుత్వంలోని శాస్త్రవేత్తల బృదం అభివృద్ది చేసింది. ఇది వరకు సార్స్ మహమ్మారి పై తాము ప్రయోగాలు జరిపాని ఆ పరిశోధనల ఆధారంగానే ముందడుగు వేశామని హేన్స్ చెప్పారు. కరోనా వైరస్ లో ఉండే సైక్ ప్రోటీన్ మానవ గ్రాహకాలకు అనుసంధానం కావడం వల్ల ఇన్ఫెక్షన్ ను కలిగిస్తోంది. అయితే ఈ ప్రోటీన్ పై ఉండే రెసెప్టార్ బైండింగ్ డొమైన్ పై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మానవుడి లోకి వైరస్ ప్రవేశించడానికి ఈ ప్రోటీన్ సహాయ పడుతుంది.
అంతే కాకుండా యాంటీబాడీలకు సహకరించి వైరస్ ను నిర్వీర్యం చేయడంలో సహాయపడుతుంది. దాంతో రెసెప్టార్ బైండింగ్ డొమైన్ లోని ఒక నిర్థిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకుని యాంటీబాడీలు సులువుగా వైరస్ పై దాడి చేయగలుగుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అచ్చం అలాంటి అనుకరించే ఓ నానో రేణువును తయారు చేశారు. శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత పెంచేందుకు ఓ రేణువును ఈ పధార్థానికి అనుసంధానం చేశారు. అంతే కాకుండా మొదట కోతుల పై ప్రయోగాలు చేసినప్పుడు ఇది సమర్థవంతంగా పనిచేసింది. వైరస్ ను నిర్వీర్యం చేయగలిగింది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ల కంటే ఈ టీకా మరింత మెరుగ్గా పని చేసినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ లు ఉత్పత్తి చేసే యాంటీబాడీల కంటే ఈ వ్యాక్సిన్ ఎక్కువ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ వ్యాక్సిన్ కరోనా ఏ రూపంలో వచ్చినా ఎదురకునేలా పనిచేస్తుంది.