"కని" కరోనా : పిల్లలనూ వదిలిపెట్టని మహమ్మారి..టెన్షన్ లో తల్లిదండ్రులు.!

frame "కని" కరోనా : పిల్లలనూ వదిలిపెట్టని మహమ్మారి..టెన్షన్ లో తల్లిదండ్రులు.!

MADDIBOINA AJAY KUMAR
దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభన కొనసాగుతుంది. ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఫస్ట్ వేవ్ లో కరోనా పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం పిల్లలపై కరోనా పంజా విసరడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 10 నుండి 15 ఏళ్ళ మధ్య వయసు వారు కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారు. 8 నుండి 10 ఏళ్ల మధ్య వయసు వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వేవ్ సమయంలో 1 శాతం మంది పిల్లలు కరోనా భారిన పడితే ప్రస్తుతం 1.2 శాతం మంది కరోనా భారిన పడుతున్నారని వైద్యు నిపుణులు చెపుతున్నారు. శాతం లో చూసినప్పుడు తక్కువ అనిపించినా ఎక్కువ మంది పిల్లలు కరోనా భారిన పడుతున్నారని చెబుతున్నారు. 


అంతే కాకుండా కరోనా పిల్లలకు సోకడానికి డబుల్ మ్యుటెంట్ కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ ఎక్కువ ప్రభావవంతం కావడం తోనే పిల్లలకు సోకుంతుందన్నారు. మరోవైపు పిల్లల కోసం ఇప్పటివరకు వ్యాక్సిన్ ప్రయిగాలు జరపలేదు. భారత్ బయోటెక్ తమ వ్యాక్సిన్ ను 5 ఏళ్ళ నుండి 18 ఏళ్ళ మధ్య వారిపై ప్రయోగం జరపడానికి అనుమతి కోరినప్పటికీ సరైన పత్రాలు సమర్పించని కారణంగా ప్రభుత్వం నిరాకరించింది. ఇక కరోనా బారిన పడ్డ పిల్లల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆకలి మందగించడం, కళ్ళు ఎర్రబడటం, జ్వరం, దగ్గు, వాంతులు విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెపుతున్నారు. అంతే కాకుండా కరోనా విజృంభన కారణంగా పిల్లలను భయటకు వెళ్ళనివ్వకూడదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్ల‌లు మాస్కులు ధ‌రించేలా చూడాల‌ని చెబుతున్నారు. ఇత‌రుల‌ను క‌ల‌వ‌నివ్వ‌కూడ‌ద‌ని ఇండోర్ గేమ్స్ తోనే వారు గ‌డిపేలా చూసుకోవాల‌ని వైధ్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: