క్రాన్‌బెర్రీస్ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి..!
అయితే ఈ పండ్లు ఎండిన తర్వాత మరింత ఎక్కువ తీపితో ఉంటాయి. వీటిలో ఫ్యాట్ ఉండదు. ఫైబర, షుగర్, ప్రోటీన్స్, సోడియం ఉంటాయి. అలాగే విటమిన్లు సి, ఎ, కె తోపాటూ పొటాషియం, కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇవి ఎండిన తర్వాత కొన్ని విటమిన్లు కోల్పోయినా... పొటాషియం, కాల్షియం మాత్రం కలిగి ఉంటాయి. సూపర్ ఫుడ్ కేటగిరీలో ఇవి కూడా చేరాయి. ఎందుకంటే వీటితో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే.
ఇక ఈ పండ్లకు వ్యాధుల్ని, గాయాల్నీ నయం చేసే శక్తి ఎక్కువ. ద్రాక్ష కంటే ఇవే ఎక్కువ బాగా పనిచేస్తాయి. ఇవి కాన్సర్ రాకుండా చేస్తాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. లివర్ పాడవకుండా కాపాడతాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. మూత్రనాళం ఆరోగ్యవంతంగా ఉండేలా ఇవి చేస్తాయి. జీర్ణక్రియను పెంచుతాయి. ఆహారనాళంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. కడుపులో వచ్చే రకరకాల వ్యాధుల్ని ఇవి అడ్డుకుంటాయి. ఇవి నోట్లో దంతాలు, చిగుళ్లు పాడవకుండా కాపాడతాయి. నోటి కాన్సర్ రాకుండా చేస్తాయి.
అంతేకాదు.. ఈ పండ్లను డైరెక్టుగా తినవచ్చు. సలాడ్లు, ఓట్స్ మీల్‌లో వేసుకొని తినవచ్చు. స్మూతీ చేసుకోవచ్చు. తీపి సరిపోదనుకుంటే కాస్త చక్కెర కూడా వేసుకోవచ్చు. కానీ జనరల్‌గా ఈ పండ్లు కొంచెం తీపిగానే ఉంటాయి. టర్కీలో క్రాన్‌బెర్రీస్‌ని చాలా ఎక్కువగా తింటారు. అక్కడి ప్రతీ శాండ్‌విచ్‌లో ఇవి ఉండాల్సిందే. అంతేకాదు... టోస్ట్, బిస్కెట్లు, పాన్‌కేక్స్‌లో కూడా ఇవి తప్పక ఉంటాయి.