షుగర్ ఉన్నవాళ్లు.. ఈ పండ్లు తింటే ఎంతో మంచిదట..?
ఏం తినాలన్నా కూడా వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా తినాలనిపించినా కూడా తినలేని పరిస్థితి. అంతే కాకుండా షుగర్ కాస్త ఎక్కువైనా కూడా ప్రమాదమే అలా అని తక్కువైనా కూడా ఎంతో ప్రమాదం ముంచుకొస్తుంది. ఇలా షుగర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు సమతుల్యంగా ఉంచుకుంటూ ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా కేవలం కొన్ని రకాల ఆహారాలను మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఏది పడితే అది తింటే మాత్రం చివరికి ప్రాణాలు మీదకు వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరిస్తూ ఉంటారు.
ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెబుతుంటారు. షుగర్‌తో బాధపడుతున్న వాళ్లు పుచ్చకాయ తినడం వల్ల ఈ పండులో నీటి శాతం అధికంగా నీరు ఉండి పిండి పదార్థాలు తక్కువగా ఉంటుంది. తద్వారా గ్లూకోస్ పెరిగినప్పటికీ వెంటనే తగ్గిపోతుంది. ఇక షుగర్ తో బాధపడేవారు యాపిల్ తినడం వల్ల అందులోని పేక్విన్ అనే కెమికల్ రక్తంలోని చక్కెరను సగానికి తగ్గిస్తుంది అంతేకాకుండా ఇక యాపిల్‌లో ఫైబర్ విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక షుగర్ తో బాధపడేవారు ఆరేంజ్ తినడం వల్ల కూడా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ కంట్రోల్ ను చేస్తాయి. దానిమ్మ నిమ్మకాయ రేగి పండ్లు కివి బొప్పాయి లాంటి పండ్లను తినడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.