తినేటప్పుడు నీరు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!

Suma Kallamadi
సాధారణంగా చాల మంది ఏమైనా తిన్నా.. లేక అన్నం తింటున్నప్పుడూ నీళ్లు తాగుతుంటారు. ఇక అన్నం కంటే ఎక్కువగా నీళ్లను తీసుకుంటూ ఉంటారు. మరికొంత మంది ఆహారం మొత్తం తిన్నాక నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే కొంతమంది తినెప్పుడు నీళ్లు తాగకూడదు అని చెబుతుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరమని కూడా చెబుతుంటారు. మరీ ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో వాళ్ళు ఏం చెబుతున్నారో ఒక్కసారి చూద్దామా.

అయితే భోజనానికి ముందు నీరు తాగడం వలన శరీరం బలహీనంగా మారిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే నీరు ఎక్కువగా త్రాగడం వలన స్థూలకాయానికి దారితీస్తుందని అంటున్నారు. ఈ సమస్య అనేది మన జీవన సైలిలో వచ్చే ఆహార అలవాట్లు వలన జరుగుతుందట. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మందికి తినేటప్పుడు నీళ్లు తాగడం అలవాటు.

కానీ.. చాలా మందికి ఖాళీగా ఉన్న సమయంలో తాగకుండా కేవలం అన్నం తినే సందర్బంలో మాత్రమే నీటిని ఎక్కువగా తాగేవారు చాలా మందే ఉన్నారు. అయితే భోజన సమయాల్లో ఎంత నీరు తాగుతారు అనేది మీ ఆరోగ్యాన్ని నిర్దేశించడంలో సహాయపడుతుంది. భోజన సమయంలో ఎక్కువగా నీళ్లు తాగడం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు తాగే విషయంలో మనం అనుసరించాల్సిన మార్గాలు కొన్ని ఉన్నాయి.


భోజనం చేసే సమయంలో సిప్ చేస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా నీరు తాగాలని తెలిపారు. ఇక ఇలా తీసుకున్న నీరు మనం తిన్న ఆహారాన్ని జీర్ణక్రియకు వీలుగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సజావుగా జరగడానికి ఈ పద్ధతి మంచిదని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి జీవక్రియ రేటు సక్రమంగా ఉండలంటే వెచ్చని నీటిని భోజనం చేసేటప్పుడు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: