వారెవ్వా.. నానబెట్టిన బాదం తింటే ఇన్ని ప్రయోజనాలా..?

praveen
ప్రస్తుతం నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి కూడా ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది. ఈ క్రమంలో వివిధ కారణాలతో ప్రతి ఒక్కరూ కూడా పని ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపేస్తున్నారు అయితే... ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ తర్వాత ఇక సంపాదించిన డబ్బు మొత్తం హాస్పిటల్లకు పెడుతూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదు. మసాలాలు దట్టించిన ఆహారాన్ని తీసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని కొన్ని వంటింటి చిట్కాలు పాటించడం వల్ల ఎన్నో  ప్రయోజనాలు ఉన్నాయి అని అటు అందరికీ తెలిసిన ప ఎవరు కూడా ఇలా వివిధ రకాల చిట్కాలు పాటించేందుకు ఆసక్తి చూపటం లేదు.



 అయితే ఇక ప్రస్తుతం ఆరోగ్యాన్ని చేకూర్చే ఆహారాలలో బాదం కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. బాదాం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు తరచూ బాదం తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అంతే కాకుండా బాదం తినడం వల్ల రోజు ఎంతో చురుకుగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా బాదం తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది ఇక నానబెట్టిన బాదం తింటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది అని చెబుతున్నారు నిపుణులు.



 ముఖ్యంగా గర్భిణీలు నానబెట్టిన బాదం తినడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగు తుంది అని చెబుతున్నారు నిపుణులు.. ఇక నానబెట్టిన బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది అని చెబుతారు. ఇక అధికబరువుతో బాధపడుతూ ఉంటే తరచూ బాదం తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది అని సూచిస్తున్నారు నిపుణులు. నానబెట్టిన బాదం పొడిగా చేసి ఇక పిల్లలకు పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల అటు యాంటీఆక్సిడెంట్లు కూడా ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అంతే కాకుండా తరచూ నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల షుగర్ ను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: