మల బద్ధకంతో బాధ పడుతున్నారా? అయితే ఈ పద్ధతులు పాటించండి....
శరీరానికి కావాల్సిన శ్రమను ఇవ్వాలి. వ్యాయామం చేయాలి.నీరు కరెక్ట్ గా త్రాగండి.మంచి నీరు, పళ్ల రసాలను ఎక్కువగా తాగాలి.ఆరోగ్యకర జీవనం కోసం మనిషి రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల మంచి నీటిని తాగాలి. దీని కంటే తక్కువ స్థాయిలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరం తనకు కావాల్సిన నీటిని మూత్రం, మలం నుంచి తీసుకుంటుంది. ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తుంటాయి. కాబట్టి నీళ్లు తాగడం చాలా మంచిది.
ప్రస్తుత బిజీబిజీ యుగంలో చాలా మంది రెడీ టూ ఈట్ ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా మల బద్దకానికి గల కారణాల్లో ఒకటి. వీటిలో పీచు పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. దీని వల్ల విరేచనం సరిగా అవ్వదు.కాబట్టి మంచి డాక్టర్ ని సంప్రదించి పీచు పదార్ధాలు ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోండి...ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...