మొటిమలతో బాధపడుతున్నరా...? అయితే నిమ్మ, అరటి తొక్కలతో చెక్ పెట్టొచ్చు...
మొటిమలతో బాధపడుతున్న వాళ్లు మొదట ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత అరటి తొక్కను తీసుకొని ముఖంపై బాగా మర్దన చేయాలి. అలాగే 20 నిమిషాలు అలాగే ఉండనిచ్చి ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల ముఖంపై మొటిమలు తొలగిపోతాయి.
మొటిమలను తొలగించడానికి నిమ్మ తొక్క బాగా సహాయపడుతుంది. ఒక నిమ్మ చెక్కపై అర కప్పు ఓట్స్, మూడు టేబుల్ స్పూన్ల చక్కర కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై బాగా మసాజ్ చేయాలి. 10 నిమిషాలు ఇలా చేసిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకసారి ఇలా చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి.
ఒక స్పూన్ పండ్ల తొక్కల పొడి, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖంపై ఉన్న మొటిమలపై రాసి పదహైదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల మొటిమలు రావడానికి కారణం అయ్యి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఫలితంగా మొటిమలు రాకుండా ఉంటాయి.
ఒక స్పూన్ పండ్ల తొక్కల పొడి, అర టీ స్పూను బేకింగ్ సోడా కలిపి ఈ మిశ్రమాన్ని మొటిమలపై రాసి రెండు నిమిషాలు తరవాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల బేకింగ్ పౌడర్ సల్మాన్ రంధ్రాల నుండి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది మొటిమలు తొలగిపోవడానికి బాగా సహాయపడుతుంది.
పసుపు పండ్లు తొక్కలతో మొటిమలను తొలగించవచ్చు. ఎలాగంటే టేబుల్ స్పూన్ పండ్ల తొక్కల పొడి, టేబుల్ స్పూన్ పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై బాగా మర్దన చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని రోజుకు ఒక సారి చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి.
పర్ల తొక్కలు మరియు తేనె మొటిమలను నివారించడానికి బాగా సహాయపడతాయి. ఎలాగంటే టేబుల్ స్పూన్ పండ్ల తొక్కల పొడి, అర టీ స్పూన్ తేనె కలిపి మొటిమలు ఉండే చోట రాసి 15 నిమిషాలు ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ప్రతి రోజు ఇలా చేయడం వల్ల మొటిమలను నివారించవచ్చు.