మెంతి ఆకుల రసం ప్రతి రోజూ సేవిస్తే ఏమవుతుందో తెలుసా..!!
మెంతి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ రక్తంలోనీ కొలెస్ట్రాల్‌నీ నియంత్రించి అధిక బరువు సమస్య నుంచి బయటపడటమే కాకుండా గుండె పనితీరు మెరుగు పరుస్తుంది.
మెంతి ఆకులో అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడటంలో కీలకపాత్ర వహిస్తుంది.
మెంతి ఆకుల్లో ఇనుము, విటమిన్-సి, బి1, బి2, కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దీనిని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రమాదకర రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
ముఖ్యంగా కామెర్ల సమస్యతో బాధపడేవారు, లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు.
నిత్యం నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను తీసుకొని రసం తీసి భోజనానికి ముందు ఒక గ్లాస్ తీసుకుంటే అందులో ఉండే సుగుణాలు సుఖ నిద్రను కలిగింప చేస్తాయి.
షుగర్ వ్యాధి గ్రస్తులకు మెంతి ఆకులు చక్కటి పరిష్కార మార్గం. మెంతి రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించి ఇన్సులిన్ని ప్రోత్సహిస్తుంది. దాంతో ఇన్సులిన్ బాగా అభివృద్ధి చెంది షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తాయి. మెంతి ఆకు రసములు నిమ్మకాయ పిండి ప్రతి రోజూ సేవిస్తే షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు.
జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారు మెంతి ఆకులను మెత్తగా చేసి గుజ్జును తలకు అంటించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి రెండుసార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తయిన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇంకా అనేక చర్మ వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.