శెనగపిండితో చర్మ సంరక్షణ... ఎలా వాడాలంటే..?
ముఖం పై ఉన్న మచ్చలను తగ్గించడానికి, ముఖం కాంతివంతంగా ఉండడానికి ఈ విధంగా చేయాలి ఒక పస్ఫూన్ సెనగపిండి, ఒక స్పూన్ కలబంద గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేసి నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖం కాంతివంతంగాను, మృదువుగా ఉండడమే కాకుండా ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి.
ముఖం పై జిడ్డు ఉన్నవాళ్ళు రెండు టేబుల్ స్పూన్లు ముల్తాని మట్టి, టేబుల్ స్కూల్ శనగపిండి, రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి రాసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మలినాలను తొలగించడం కాకుండా, జిడ్డును కూడా కలిగిస్తుంది.
రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, చిటికెడు పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ లో కలుపుకుని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేయాలి. ఈ విధంగా చేయడం. ముఖం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా పొడి చర్మం ఉన్నవాళ్లు ఈ మిశ్రమానికి మజ్జిగ మీగడ కలిపి కలిపి రాసుకోవడం వల్ల చర్మానికి కావలసిన తేమ లభిస్తుంది.
చర్మంపై మృత కణాలను తగ్గించడానికి ముఖంపై ఉన్న జిడ్డును ను తొలగించడానికి శెనగపిండిలో కి తగినంత పెరుగు కలుపుకుని పేస్ట్లా చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. ఐదు నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
ముఖంపై ముడతలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి, రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, బాగా పండిన ఒక టమాటా రసాన్ని తీసుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి బాగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు పోయి ముఖము నునుపుగా ఉంటుంది.