కాఫీ, టీ తాగిన తర్వాత మంచి నీళ్లు తాగొచ్చా.. తాగితే ఏమవుతుందో తెలుసా..?

kalpana
సాధారణంగా మన జీవితం ప్రతి రోజు ఒక కప్పు కాఫీ లేదా టీ తో మొదలవుతుంది. సాధారణ వ్యక్తి గురించి ప్రముఖుల వరకు వారి రోజున ఒక కప్పు కాఫీ తో ప్రారంభిస్తారు. ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగినప్పుడు మాత్రమే మన శరీరం ఎంతో చురుగ్గా పని చేస్తూ ఇతర పనులపై ధ్యాసను పెంచుతుంది.అయితే ఈ కాఫీ, టీలను తాగడం గురించి కొందరు కొన్ని రకాల సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.కొందరు కాఫీ, టీ లను అధికంగా తీసుకుంటే మంచిదని చెబుతుంటారు. మరికొందరు అలా ఎక్కువగా తాగటం వల్ల ఎంతో ప్రమాదం అని భావిస్తారు. మరికొందరైతే కాఫీ తాగిన తర్వాత మంచి నీళ్లు తాగకూడదు అని, మంచి నీళ్లు తాగిన తర్వాత కాఫీ తాగాలని చెబుతుంటారు. ఈ విధంగా కొందరిలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. అయితే వీటి గురించి నిపుణులు ఏమంటున్నారు ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా కాఫీ, టీ అనే పదార్థాలు మన శరీరాన్ని చురుకుగా పనిచేయడానికి దోహదపడతాయి. ఇందులో ఉన్నటువంటి కెఫిన్ అనే పదార్థం మన గుండె పనితీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు కాఫీ తాగితే మన శరీరం ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగని ఎక్కువ మొత్తంలో ఈ కాఫీ తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన పరిమాణంలో మాత్రమే కాఫీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదేవిధంగా కాఫీ తాగే ముందు ఒక గ్లాసు నీటిని త్రాగటం వల్ల ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.వేడిగా ఉన్నటువంటి కాఫీ తాగినప్పుడు ఆ వెచ్చదనం మన జీర్ణాశయం పై ఏర్పడిన పొరను దెబ్బ తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేడి వేడిగా కాఫీ తాగే ముందు ఒక గ్లాస్ నీటిని తాగటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవు.అయితే కాఫీ లేదా టీ తాగిన తర్వాత కొంతసేపటికి మన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాలపై పేరుకుపోయిన కెఫిన్ అనే పదార్థం బయటకు వెళుతుంది. ఈ పదార్థం పళ్లపై పేరుకుపోవటం వల్ల పళ్ళు గారపడతాయి.కాబట్టి కాఫీ తీసుకునే సమయంలో సరైన మోతాదులో తీసుకోవడంతో పాటు వీటిని తాగే ముందు ఒక గ్లాసు మంచి నీటిని తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: