విస్తారంగా కనిపించే నాగజెముడు చెట్టు యొక్క కాయలను తింటే ఏమౌతుందో తెలుసా..

Divya
సాధారణంగా మనం చిన్నప్పుడు చూసే ఉంటాం.. పల్లె ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఇసుక నేలల్లో, కొండ ప్రాంతాల్లో విస్తారంగా కనిపించే ఈ నాగజెముడు తక్కువ నీటితో, ఎక్కువ రోజులు బతుకుతూ  చెట్టు నిండా ముళ్ళతో, ఎర్రటి  పగడుపు వంటి కాయలతో  పడగవిప్పిన పాము పడగల భయంకరంగా ఉంటుంది. కానీ వీటికి ఉండే కాయలు మాత్రం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా  మన ప్రాంతంలో వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ విదేశాల్లో మాత్రం ఆహారంలో భాగంగా వీటి పండ్లను ఉపయోగిస్తారు.

ఈ మొక్కను ఇండియన్ కాక్టస్ లేదా నాగజెముడు అంటారు. అయితే ఈ మొక్కను జాగ్రత్తగా సేకరించి, పైన తొక్క, లోపల విత్తనాలను తీసి గుజ్జును మాత్రమే తినాలి. వీటిలో విటమిన్ సీ,యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి,రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా సీజనల్ ఫ్లూ, జ్వరం వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. వీటిలో ఉండే క్యాల్షియం కారణంగా ఎముకలు ఆరోగ్యంగా,దృఢంగా,పటిష్టంగా తయారవుతాయి. పిల్లలలో ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పెద్దల లో కూడా జ్ఞాపకశక్తి పెరిగి, వయసుతోపాటు వచ్చే అల్జీమర్స్, డిమేన్షియా వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

ఈ పండులో విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సీ, యాంటి ఆక్సిడెంట్లు ఉండడంవల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడి, చర్మ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే  డైటరీ ఫైబర్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కోలన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో చెడు బ్యాక్టీరియాను అంతంచేసి, మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది. ఇక వీటిలో పోషకాలు అధికంగా ఉండి,కేలరీలు తక్కువగా ఉండడం వల్ల కూడా అధిక బరువును అధిగమించవచ్చు. ఇక చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

లివర్ లోని విషపదార్థాలను తొలగించి,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక తలనొప్పి, మైగ్రేన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు, చర్మం, గోర్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ పండ్లను తినడానికి ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: