బ్రెస్ట్ క్యాన్సర్ కు దూరంగా ఉండటానికి..ఈ ఆహారం చాలా మంచిది...

kalpana
ప్రస్తుతం జీవన శైలిలో మార్పుల వల్ల, ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముందు నుంచి ఈ సమస్య పై సరైన అవగాహన ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవాట్లను మార్చుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సహాయపడే సహజసిద్ధమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 రోజు కాఫీ, టి తాగుతూ ఉంటాము. వీటి బదులు రోజుకు రెండు కప్పులు చల్లని లేదా వేడి గ్రీన్ టీ తాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ.

పాలకూర తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పాలకూరను వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గినట్లే.

 బీటా-కెరోటిన్ ఉన్నా పదార్థాలను తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తక్కువ. బీటా కెరోటిన్ అనే పదార్థం క్యారెట్ లో ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకు రెండు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 చెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల బెస్ట్ క్యాన్సర్ కు మంచి మందులా పనిచేస్తుంది. చెర్రీ పళ్ళ లో ఉండే ఒక రసాయనం బ్రెస్ట్ క్యాన్సర్ ను నిరోధిస్తుంది. చెర్రీ పండ్లను జ్యూస్ రూపంలో గాని, సలాడ్ రూపంలో గాని తీసుకోవచ్చు.

 వెల్లుల్లికి క్యాన్సర్ కణాలను నిరోధించే శక్తి ఉంటుంది. వెల్లుల్లిని పొట్టు తీసి పది నిమిషాలు ఆగిన తర్వాత తీసుకోవడం వల్ల సమర్థవంతంగా క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది.

 విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.అలాగే ఈ రోజు సాయంత్రం పూట ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి లభిస్తుంది.

 టమాటాను తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తక్కువ. ఎందుకంటే టమాటా లో లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రోజూ ఆహారంలో భాగంగా టమోటాను చేర్చుకోవడం మంచిది.

 బ్రెస్ట్ క్యాన్సర్ నుండి దూరంగా ఉండటానికి,ముడి బియ్యం,గోధుమలు వాడటం చాలా మంచిది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: