జ్ఞాపకశక్తి సరిగా లేదా..? ఈ ఆహారపదార్ధాలు తింటే అమాంతం జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చట...
జ్ఞాపకశక్తి..ఇదొక దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం. అసలు జ్ఞాపకశక్తి లేకపోతే ఏ పనిని మనం సవ్యంగా చేయలేము. ప్రస్తుత వేగవంతమైన కాలంలో మనం స్మార్ట్ ఫోన్ల మీద కంప్యూటర్ల మీద మరే ఇతర టెక్నాలజీ పైన ఆధారపడి, పూర్తిగా మన జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాం. పూర్వకాలంలో ఉదాహరణకు ఏవైనా కూడికలు ,తీసివేతలు చేయాలంటే నోటి లెక్కల ద్వారా చెప్పేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎలాంటి కూడికలు చేయాలన్నా కూడా క్యాలిక్యులేటర్ పైన ఆధారపడాల్సి వస్తోంది. ఇక అంతేకాకుండా ఏదైనా సరే ఇట్టే గుర్తు పెట్టుకునే వారు,కానీ ప్రస్తుత కాలం ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక ఏమీ గుర్తు లేకుండా పోతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే పిల్లలు సరిగా చదవడం లేదు అంటూ వారిని చితకబాదేస్తున్నారు. అంతేకాక ఎన్నో తీవ్ర పరిణామాలకు గురి అవుతున్నారు. ప్రతి ఒక్కరికి సమానమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. కానీ దానిని వినియోగించే వారిని బట్టి ఉండడం గమనార్హం. అయితే జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి అంటే మాత్రం సరైన పోషకాలు ఉండాలని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ:
ఉదయాన్నే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాఫీ తాగడాన్ని ఇష్టపడతారు. ఈ కాఫీ లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి కెఫిన్ మరొకటి యాంటి ఆక్సిడెంట్లు. ఇది మన మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతాయి.
బ్రోకలీ :
బ్రోకలీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ కె కూడా చాలా ఎక్కువ. ఒక కప్పు బ్రోకలీ లో వంద శాతం కంటే ఎక్కువ విటమిన్ కె ను పొందవచ్చు. కొవ్వులో కరిగే విటమిన్,మెదడు కణాలతో దట్టంగా నిండిన ఓమేగా 3 కొవ్వు తత్వాన్ని ఏర్పరచడానికి అవసరమవుతుంది.
డార్క్ చాక్లెట్ :
కాఫీ లాగానే డార్క్ చాక్లెట్ లో కూడా కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్ పాటు కోకో పౌడర్ ఫ్లేవనాయిడ్స్ కూడా పుష్కలంగా లభించడం వల్ల,ఇది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
గుమ్మడికాయ విత్తనాలు :
గుమ్మడికాయ విత్తనాల లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల, ఇది మన శరీరంతో పాటు మెదడుని కూడా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఐరన్,జింక్ తో పాటు కాపర్ అధికంగా ఉంటాయి.
చేపలు :
చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు సాల్మన్, ట్రౌట్, సార్డినెస్ అధికంగా ఉంటాయి. మెదడులో 60 శాతం కొవ్వు తయారయ్యే ఈ కోవలో సగం ఒమేగా త్రీ కొవ్వులు ఉంటాయి. అంతేకాకుండా వయస్సు ద్వారా వచ్చే మానసిక క్షీణత వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. దీన్ని నివారించడానికి చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తోడ్పడతాయి. ఇక మెదడు పని తీరును మెరుగు పరచుకోవచ్చు.
గుడ్లు :
గుడ్లలో కూడా విటమిన్ బి 6 విటమిన్ బి 12 తోపాటు కోలిన్ తో నిండిన గుడ్డు మెదడు ఆరోగ్యంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.
ఇంకా ఇవే కాక గ్రీన్ టీ, నారింజ, పసుపు కూడా మెదడు పని తీరును పెండానికి ఎంతగానో దోహదపడతాయి.