
వజ్రం కంటే విలువైనది.. ఎన్నో రకాల రోగాలను నయం చేయగల శక్తి దానికి ఉందట..
వజ్రం కంటే విలువైనది మన ప్రాణం. మనం జీవించి ఉండాలి అంటే ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, మన ప్రకృతిలో లభించే ఎన్నో రకాల మొక్కలలో ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తించాలి. మరీ ముఖ్యంగా మన ఆయుర్వేదశాస్త్రంలో తెలిపిన ప్రకారం ఉత్తరేణి ఆకు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరేణి ఆకు ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో, రోడ్డుకిరువైపులా ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరుగుతూ ఉంటుంది. అయితే మనలో చాలామంది పిచ్చి మొక్క అని పీకేస్తూ ఉంటారు. ఉత్తరేణి ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మాత్రం కంపల్సరిగా దాచుకుంటారు. అయితే ఈ ఉత్తరేణి ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరేణి మొక్క తో పాటు విత్తనాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు,ఫ్లేవనాయిడ్స్, టానిన్స్ వంటి రసాయనాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇది ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఉత్తరేణి కాయల పొడి లో తేనె కలుపుకొని తాగడం వల్ల ఆకలి వేయడం, జీర్ణక్రియ లక్షణాలు పెరగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కొన్ని ఉత్తరేణి విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల అధిక కొవ్వు ఏర్పడకుండా చూడడంతో పాటు బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
శరీరంపై గాయమైన ప్రదేశంలో,ఈ ఉత్తరేణి ఆకుల రసాన్ని పూయడం వల్ల , రక్తస్రావం ఆగి,బ్యాక్టీరియాను నిరోధించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది.ఫలితంగా గాయం తొందరగా మానుతుంది. అంతేకాకుండా అల్సర్ తో పాటు ఎసిడిటీ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఉత్తరేణి ఆకులను లేదా వేర్లను పేస్టులా చేసుకొని, నీళ్లలో లేదా పాలల్లో కలిపి తాగడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. కుక్క కాటుకు కూడా ఈ ఆకుల రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కుక్క కరిచినప్పుడు ఈ ఆకుల రసాన్ని తేనెతో కలిపి తాగడం వల్ల కుక్క కాటు విషం విరిగిపోతుంది.
అలాగే గర్భం శుద్ధికి, పీరియడ్స్ క్రమం తప్పకుండా రావడానికి, ఇక పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం అవుతుంటే, ఈ ఆకుల రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం, ప్లీహం శుద్ధికి, రక్తం వృద్ధి చెందడానికి,చర్మం కాంతివంతంగా ఉండడానికి ఉత్తరేణి మొక్క ఎంతగానో సహాయపడుతుంది. ఉత్తరేణి మొక్క యొక్క ఆకులు, వేర్లు సమపాళ్లలో తీసుకుని, ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇక ఈ పొడికి తేనె కలిపి తీసుకోవడం వల్ల గర్భ సమస్యలు దూరం అవుతాయి. రక్త మొలలతో ఇబ్బంది పడుతున్న వారు 50 గ్రాములు ఉత్తరేణి ఆకుల పొడికి,50 గ్రాముల నెయ్యి కలిపి తినడం వల్ల ఎలాంటి రక్తమొలల సమస్య నుంచి అయిన బయటపడవచ్చు. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరిగించి వేస్తుంది.