మీరు ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి!!

kalpana
ఈరోజుల్లో ఫ్రిజ్ వాడకం అనేది సర్వసాధారణం. మన ఫ్రిజ్  ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం మీకు తెలుసా! ఎందుకంటే మనం ప్రతిరోజు ఫ్రిజ్ లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా ఆహారంగ తీసుకుంటాం. కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రతి వస్తువు తాజాగా ఉంటాయనుకోవడం పొరపాటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా కూడా అందులో పోషక విలువలు తగ్గి మన శరీరానికి హాని చేయవచ్చు.

మనం తినే ఆహార పదార్థాలు అన్నిటినీ ఫ్రిజ్లో పెట్టి వాడడం అనేది సాధారణంగా మనం చేస్తుంటాం. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి రుచులు  మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం  ఉంది. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదో ఇప్పుుడు చూద్దాం.

చాలామంది  తేనెను కూడా ఫ్రిజ్లో పెట్టి వాడేస్తుంటారు.  తేనెకు సహజసిద్ధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే గుణం ఉంటుంది. కాబట్టి తేనెను ఫ్రిజ్లో పెట్టడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. తేనెను ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు ఉంచితే అది సహజ గుణాలను కోల్పోయి మామూలు చక్కగా మారుతుంది.

గుడ్లు హై ప్రోటీన్స్ కలిగిన ఆహారం అని మనందరికీ తెలుసు. కాకపోతే గుడ్లను ఎక్కువమంది ఫ్రిజ్లో నిల్వ ఉంచి వాడుతుంటారు. అలా చేస్తే ఇందులో ఉన్న పోషక విలువలు నశిస్తాయి. పైగా చల్లటి వాతావరణంలో గుడ్డును ఉంచితే వాటిపై బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుందట. గుడ్డును రూమ్ టెంపరేచర్ లో నిల్వ ఉంచడం ఉత్తమం.

ఆలుగడ్డలను ఫ్రిజ్ లో పెట్టినప్పుడు అందులో ఉంటే పిండిపదార్థాలు షుగర్ గా మారుతాయి. అలా ఫ్రిజ్ లో పెట్టిన ఆలుగడ్డలను వండితే ఆ షుగర్ కాస్త అమైనో యాసిడ్ తో కలిసి ఎక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఆ రసాయం మన శరీరంలోకి ప్రవేశిస్తే నరాలు, కండరాలు బలహీనమవుతాయని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.

అరటి పండును ఫ్రిజ్లో ఉంచితే అరటిపండు పై చర్మం నల్లగా మారుతుంది.పైగా అందులో ఉన్న పోషక విలువలు తగ్గి రుచిని కోల్పోతుంది.

బ్రెడ్ ను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల త్వరగా డ్రై అవుతుంది.బ్రెడ్ ను చల్లటి వాతావరణంలో ఎక్కువ రోజులు నిలువ ఉంచితే వాటిపై బ్యాక్టీరియా ,ఫంగస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది .

ఫ్రిజ్ లో ఉంచిన ఆహార పదార్థాలను తినాలనుకుంటే ఒక గంట ముందు బయటకు తీసి ఉంచి తర్వాత శుభ్రపరుచుకుని తినడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: